బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం!

TG: ఆసిఫాబాద్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కేవలం నాలుగేళ్ల రిటర్నులు సమర్పించలేదన్న ఒక్క కారణంతో ఎన్నిక చెల్లదని ప్రకటించలేమని అభిప్రాయపడింది.

New Update
KOVA LAKSHMI

Kova Lakshmi: తెలంగాణ రాజకీయాల్లో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలనే పిటిషన్స్ ఎక్కువగా దాఖలు అవుతున్నాయి. ఎన్నికల అఫిడవిట్ లో సరైన సమాచారాన్ని పొందుపరచలేదని ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్, మల్లారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితో సహా పలువురు నేతలపై హైకోర్టులో పిటిషన్ లు దాఖలైన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే తరహాలో దాఖలైన పిటిషన్ లో ఆసిఫాబాద్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి బిగ్ రిలీఫ్ దక్కింది.  ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కేవలం నాలుగేళ్ల రిటర్నులు సమర్పించలేదన్న ఒక్క కారణంతో ఎన్నిక చెల్లదని ప్రకటించలేమని అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: ఎకరాకు రూ.15,000.. నేడు రానున్న క్లారిటీ!

అసలు ఏంటి ఈ కేసు?...

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గం ఆసిఫాబాద్‌ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థినిగా కోవ లక్ష్మి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా అజ్మీర శ్యాంనాయక్‌లు పోటీ చేశారు. ఎన్నికల్లో కోవ లక్ష్మి విజయం సాధించింది తన నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేశారు. కాగా ఆమె దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందు పరిచారని.. ఎన్నికల అఫిడవిట్ లో 2022-23 ఆదాయపు పన్ను రిటర్నులను మాత్రమే ఆమె సమర్పించారని, అంతకుముందు నాలుగేళ్ల వివరాలను అందులో పేర్కొనలేదని.. ఈ కారణంతో ఆమె ఎన్నికను రద్దు చేసి, ఆ స్థానంలో తనను ఎమ్మెల్యేగా ప్రకటించలని కోరుతూ కాన్ ఓటమి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్యాంనాయక్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్

ప్రజలిచ్చిన తీర్పుకు కట్టుబడి...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి 2017-18లో రూ.5.40 లక్షల ఆదాయం చూపారని.. ఆ తరువాత నాలుగేళ్ల ఆదాయాన్ని అఫిడవిట్ లో పేర్కొనకుండా తొక్కిపెట్టారని అన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌గా, మాజీ ఎమ్మెల్యేగా పొందిన గౌరవ వేతనం, పింఛను కలిపి రూ.15.60 లక్షలను చూపలేదని పేర్కొన్నారు. కాగా కోవ లక్ష్మి తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్.. వాటన్నిటి ఖండించారు. పిటిషనర్ ఎన్నికల పిటిషన్‌కు కావాల్సిన ఆధారాలను కోర్టుకు సమర్పించలేదని చెప్పారు. అసలు పిటిషన్‌ దాఖలుకు సరైన కారణమే చూపలేదని స్పష్టం చేశారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాది ఎన్నికల అఫిడవిట్‌లో పాన్‌ నంబరుతోపాటు ఆదాయంగా చూపిన రూ.11.15 లక్షల వివరాలున్నాయని చెప్పింది.ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు పవిత్రమైందని.. నాలుగేళ్ల రిటర్నులను సమర్పించలేదన్న కారణంతో ఎన్నికను రద్దు చేయలేమని ఆ పిటిషన్ ను కొట్టేసింది.

ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు!

ఇది కూడా చదవండి:  సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్!

Advertisment
Advertisment
తాజా కథనాలు