అమిత్ షాతో గవర్నర్ భేటీ.. కేటీఆర్ అరెస్ట్ పై కీలక నిర్ణయం? తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీ పర్యటన తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కేటీఆర్ ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఆయన కేంద్ర హోంమంత్రితో చర్చించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. By Nikhil 13 Nov 2024 in తెలంగాణ రాజకీయాలు New Update షేర్ చేయండి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీకి వెళ్లడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరో 4 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఫార్ములా - ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ విచారణకు తెలంగాణ ఏసీబీ గవర్నర్ ను అనుమతి కోరింది. ఇందుకు సంబంధించి అమిత్ షాతో గవర్నర్ చర్చించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అమిత్ షా ఆదేశాల ప్రకారమే గవర్నర్ నడుచుకుంటారన్న చర్చ సాగుతోంది. ఈ రోజు సాయంత్రం గవర్నర్ ఢిల్లీ నుంచి రానున్నారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కేటీఆర్ విచారణపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో గవర్నర్ అమిత్ షా భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇది కూడా చదవండి: కలెక్టర్ పై దాడి ఎలా చేశారంటే.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు! కేటీఆర్ సైతం ఢిల్లీకి.. మొన్న కేటీఆర్ సైతం ఢిల్లీకి వెళ్లారు. అమృత్ స్కీమ్ పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లానని ఆయన వెల్లడించారు. కానీ కేంద్ర పెద్దలను కలిసి కేసు నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ టూర్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వకుండా మరే నిర్ణయం తీసుకున్నా బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కే ఇందుకు కారణమన్న ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. ఇది కూడా చదవండి: HYDRA: హైడ్రాకు షాక్.. కూల్చివేతలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు! ఒక వేళ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే కేటీఆర్ ను విచారించేందుకు తెలంగాణ ఏసీబీ సిద్ధం అవుతోంది. విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో గవర్నర్ ఏ స్టెప్ తీసుకున్నా.. అది తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: Revanth Reddy: కొడంగల్‌లో అసలేం జరుగుతోంది.. ఫార్మాసిటీని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? #ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి