దీపావళి బోనస్.. నేడు అకౌంట్లో డబ్బు జమ! తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ప్రకటించిన బోనస్‌ను నేడు వారి ఖాతాలో జమ చేయనుంది. ఒక్కో కార్మికునికి సగటున రూ.93,750 ఖాతాలో జమ కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.358 కోట్లు ఖర్చు చేస్తోంది. గత ఏడాది కంటే రూ.50 కోట్లు ఎక్కువ. By V.J Reddy 25 Oct 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి Diwali Bonus: తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ప్రకటించిన బోనస్‌ను నేడు వారి ఖాతాలో జమ చేయనుంది. ఒక్కో కార్మికునికి సగటున రూ.93,750 ఖాతాలో జమ కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.358 కోట్లు ఖర్చు చేస్తోంది. గత ఏడాది కంటే రూ.50 కోట్లు ఎక్కువ. సింగరేణిలో ఉత్పత్తి ఆధారిత పురస్కార పథకం(PLRS) కింద కార్మికులకు అందించే దీపావళి బోనస్‌ను వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే సింగరేణి కార్మికులకు తమ ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారికి దీపావళి కానుకగా బోనస్ ఇస్తుందని.. ఇందుకోసం మొత్తం రూ.358 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌పై తిరగబడ్డ జీవన్ రెడ్డి! 40 వేల మంది కార్మికులు... ఇది కూడా చదవండి: సంచలన విషయాలు బయటపెట్టిన వైసీపీ కాగా గత బీఆర్య్స్ ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే తమ ప్రభుత్వం ఇస్తోంది రూ. 50 కోట్లు అధికమని చెప్పారు. సింగరేణిలో పని చేసే ఒక్కో కార్మికుడికి సగటున రూ.93,750 అందనున్నట్లు తెలిపారు. నిన్న సచివాలయంలో సింగరేణిపై సమీక్ష సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండుగకు ముందే బోనస్ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 40 వేల మంది కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ అందుతోందని అన్నారు. ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే! బొగ్గు కంపె నీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా బోనస్ చెల్లించే పద్ధతి కొన్నేళ్లుగా అమల్లో ఉందని గుర్తు చేశారు. ఇటీవల తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణి ఉద్యోగులందరికీ 33 శాతం లాభాల వాటా కింద రూ.796 కోట్లను అందించినట్లు చెప్పారు. ఇందులో ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు అందాయని అన్నారు, అలాగే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.5 వేల చొప్పున చెల్లించినట్లు తెలిపారు. దసరా పండుగ అడ్వాన్స్ కింద ఒక్కో కార్మికునికి రూ. 25 వేల చొప్పున మరో రూ.90 కోట్లను జమ చేసినట్లు వెల్లడించారు. తమది ప్రజాప్రభుత్వం అని.. అందరి సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: ఆధార్ కార్డు చెల్లదు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి