/rtv/media/media_files/oum4u0T0hgBMYNJtmsdQ.jpg)
Seeds Delivery: తెలంగాణ ప్రభుత్వం రైతులు చేదోడుగా ఉండేందుకు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఫోన్ లో యాప్ ద్వారా ఆర్డర్ పెడితే ఇంటి వద్దకే ఆహారం వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహాలో వ్యవసాయ రంగంలో కూడా అమలు చేసేలా కార్యాచరణ చేపట్టింది ప్రభుత్వం. ఒక ఫోన్ కాల్ తో ఇంటి వద్దకే వరి విత్తనాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సన్నాహాలు చేస్తోంది. యాసంగి పంట వస్తున్న క్రమంలో మొత్తం 2.5 లక్షల ఎకరాలకు సరిపడా 50 వేల క్వింటాళ్ల నాణ్యమైన వరి విత్తనాలు సరఫరా చేయాలని విత్తనాభివృద్ధి సంస్థ టార్గెట్ పెట్టుకుంది. వివిధ మార్గాల ద్వారా వరి విత్తనాలను రైతుల దగ్గరకు చేరవేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.
ఇది కూడా చదవండి: రాజకీయాలు బ్రేక్.. కేటీఆర్ సంచలన నిర్ణయం!
ఈ రకాల విత్తనాలకు గిరాకీ ఎక్కువ..!
ఇది కూడా చదవండి: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు!
వర్ష కాలంతో పోలిస్తే యాసంగి పంట మంచిగా వస్తుంది. వరి కూడా రోగాల భారిన పడకుండా ఉంటుంది. వర్ష కాలం పంట రైతులకు భరోసా ఇవ్వకపోయినా.. యాసంగి పంట మాత్రం రైతులకు నష్టం వాటిల్లకుండా చేస్తుంది. అయితే ఈ సీజన్ రైతులకు ఎక్కువ లాభం తెచ్చే వరి విత్తనాలను రైతులకు ఇంటి వద్దకే, సరసమైన ధరలకే అందించే దిశగా రాష్ట్ర వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది.
ఇది కూడా చదవండి: రైతులకు గుడ్‌న్యూస్.. ఈరోజు 3 లక్షల మందికి రుణమాఫీ !
ఇందుకోసం యాసంగి సీజన్ లో రైతుల నుంచి గిరాకీ ఎక్కువగా ఉన్న తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్- 15048), కూనారం సన్నాలు (కేఎన్‌ఎం- 163), జగిత్యాల సన్నాలు (జేజీఎల్- 27356)తోపాటు.. దొడ్డు రకాలైన కేఎన్‌ఎం- 118, జేజీఎల్- 4423, ఎంటీయూ- 1010, ఆర్‌ఎన్‌ఆర్- 29325 ఇలా మొత్తం ఏడు రకాల వరి విత్తనాలను సరఫరా చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో 10 కిలోల విత్తన బస్తా రూ.900 ఉండగా.. విత్తనాభివృద్ధి సంస్థ 15 కిలోల బస్తాకు రూ.700, 25 కిలోల బస్తాకు రూ.995 చొప్పున ధరకే రైతులకు ఈ విత్తనాలను అందించనున్నారు.
ఇది కూడా చదవండి: ప్లీజ్ నాన్న మమ్మల్ని చంపొద్దు.. కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి
Komatireddy Raj Gopal Reddy : నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నది జానారెడ్డే...రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీస్థాయిలో కుట్రలకు తెర లేపారన్నారు.
Komatireddy Raj Gopal Reddy
MLA Komatireddy Raj Gopal Reddy : గత కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీస్థాయిలో కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. సొంత జిల్లా నేత సీనియర్ నేత జానారెడ్డి ఈ విషయంలో ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నాడని ఫైర్ అయ్యారు. అధిష్టానం వద్ద తనకు మంత్రి పదవి ఖాయమైనా.. కావాలనే జానా పదేపదే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
25 ఏళ్లు మంత్రి పదవిలో జానారెడ్డి ఉన్నది సరిపోదా అని ధ్వజమెత్తారు. అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే.. దాన్ని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని.. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాగా తనకు మంత్రి పదవి అనగానే కొంతమంది భయపడుతున్నారని ఆయన అన్నారు.