మూసీ నిర్వాసితుల సమస్యలపై సర్కారు ఫోకస్‌

TG: మూసీ నిర్వాసితుల సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్‌ పెట్టింది. మూసీ బాధితుల సమస్యలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మూసీ నిర్వాసితుల సమస్యలపై సంప్రదింపుల బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు సీఎం రేవంత్.

New Update
Revanth 2

Musi River: తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మూసీ నిర్వాసితుల సమస్యలపై సర్కారు ఫోకస్‌ పెట్టింది. మూసీ బాధితుల సమస్యలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూసీ నిర్వాసితుల సమస్యలపై సంప్రదింపుల బాధ్యత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ కు అప్పగించింది. పేదలను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని సూచనలు చేశారు సీఎం రేవంత్.

ALSO READ: BIG BREAKING: తిరుమల ప్రసాదంలో జెర్రీ!

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా రేవంత్ సర్కార్ చేపట్టిన మూసీ నది సుందరీకరణ కార్యక్రమానికి అడ్డంకులు తగులుతున్నాయి. మూసీ నది నిర్వాసితులు పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు ఎలాగైనా మూసీ నది సుందరీకరణ చేసి తీరుతామని రాష్ట్ర ప్రభుత్వం పట్టు బట్టుకుంది.

రూ.25,000 ఇవ్వనున్న సర్కార్..

ఇటీవల మూసీ నిర్వాసితులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు రూ.25,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటన విడుదల చేశారు. మూసీ నిర్వాసితులందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇచ్చి పునరావాసం కల్పిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో 15 వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మూసీ రివడ్‌ బెడ్‌, బఫర్‌ జోన్‌లలో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికి రాష్ట్ర సర్కార్ కేటాయించింది. రివర్‌ బెడ్‌లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణ కోసం సంబంధిత జిల్లా కలెక్టర్లు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. నిర్వాసితులకు డబులు బెడ్ రూం ఇళ్లు కేటాయించి పునరావాసం కల్పించిన తర్వాతే ఈ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభిస్తామని పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు