/rtv/media/media_files/2025/09/27/cm-revanth-dasara-gift-2025-09-27-16-33-29.jpg)
మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు చేయూతను అందించడం కోసమే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని యువతీ యువకులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) మార్చుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లేపల్లి ఐటీఐ కేంద్రంలో నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను సీఎం రేవంత్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.2000 రూపాయల స్టయిఫండ్ ఇస్తామన్నారు. ఇది ఖర్చు కాదని.. వారి భవిష్యత్తుకు పెట్టుబడి అని న్నారు. ఇక్కడ చదివే విద్యార్థులకు ఉద్యోగావకాశాలు, పాస్పోర్టు తదితర సర్వీసులు అందించడానికి ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నైపుణ్యత కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడంతో పాటు విదేశాల్లో ఉద్యోగావకాశాలను పొందడానికి సహాయం చేస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Follow Us