ఎకరాకు రూ.15,000.. నేడు రానున్న క్లారిటీ! TG: ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి భేటీ కానుంది. ఈ భేటీలో రైతు భరోసా, రుణమాఫీ, డిజిటల్ హెల్త్ కార్డులు, మూసీ నిర్వాసితులకు నష్టపరిహారం, కులగణన, జీవో 317, హైడ్రా, ధరణిపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. By V.J Reddy 26 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Rythu Bharosa: ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి వర్గం నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాల్లో ఎదురవుతున్న వ్యతిరేకను తిప్పికొట్టేందుకు ప్రణాళిక, రైతు భరోసా, రుణమాఫీ, డిజిటల్ హెల్త్ కార్డులు, మూసీ నిర్వాసితులకు నష్టపరిహారం, కులగణన, జీవో 317, హైడ్రా, ధరణిపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్ రైతుల భరోసాపై.. ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు! ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో ముఖ్యంగా రైతు భరోసాపై మంత్రి వర్గం చర్చించనుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎకరాకు ఏడాదికి రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే.. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.5,000లను అందించింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు గడుస్తున్నా ఇంకా రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు తప్ప ఆచరణలోకి తేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్! డిసెంబర్‌లో మొత్తం రూ.15,000..! వాస్తవానికి పెట్టుబడి సాయం అనేది రైతులకు పంట పెట్టుబడి పెట్టేందుకు ఇవ్వాలి. అయితే.. జూన్ నెలలో ఇవ్వాల్సిన రైతు బంధు అలియాస్ రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం పంట కోతకు వచ్చిన ఇంకా ఆ నిధులను రైతుల ఖాతాలో జమ చేయలేదు. దీనినే ఎజెండా తీసుకున్న ప్రతిపక్షాలు.. ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతున్నాయి. వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ ప్రభుత్వం నమ్మకం తగ్గుతుందని భావిస్తున్న కాంగ్రెస్.. ఎలాగైనా రైతు భరోసా నిధులను విడుదల చేసి ప్రతిపక్షాలు నోర్లు మూపించాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో ఏడాదికి ఎకరాకు ఇచ్చే రూ.15,000లను రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా దీనిపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి