డిసెంబరు నాటికి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ

TG: డిసెంబరు నాటికి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎన్డీఎస్ఏ బృందం డిసెంబరులో రాష్ట్రానికి రానుంది. అప్పటిలోగా మేడిగడ్డలో పరీక్షలు కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Medigadda Project : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల విషయంలో కమిటీ ఏర్పాటు

Medigadda: డిసెంబరు నాటికి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మేడిగడ్డ సహా మూడు బ్యారేజీల్లో వరద ప్రవాహం కొనసాగు తుండటంతో భూభౌతిక పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారింది. బ్యారేజీల ఎగువ, దిగువ ప్రాంతాల్లో వేసిన బోరు రంధ్రాలను మూసి వేయగా వాటిని తెరిచి ఈ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఇప్పటి వరకు 90% పరీక్షలు పూర్తయ్యాయని, మిగిలినవి పూర్తి చేసి ఆ సంస్థకు పంపించాల్సి ఉందని తెలిపారు. ఎన్డీఎస్ఏ బృందం డిసెంబరులో రాష్ట్రానికి రానుంది. అప్పటిలోగా మేడిగడ్డలో పరీక్షలు కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై సంచలన రిపోర్ట్...

మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో ప్రశ్నార్థకంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో భాగమైన అన్నారం బ్యారేజీ చాలా వీక్ గా ఉన్నట్లు షాకింగ్ స్టడీ బయటకు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 గేట్ల నిర్మాణంలో ఏ మాత్రం నాణ్యత లేదని ఆ స్టడీ పేర్కొనడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అనంతరం కొద్ది రోజులకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు బుంగలు పడిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ పుణెకి చెందిన  సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్​ స్టేషన్ (CWPRS) తో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద ఫిజికల్ టెస్టులను చేయించాలని నిర్ణయించింది. దీంతో CWPRS ఈ బ్యారేజీలోని 26వ నంబర్ గేట్ నుంచి 46వ నంబర్ గేట్ వరకు పరీక్షలు చేసింది.

16 గేట్ల నిర్మాణంలో నాణ్యత లేదు..

మొత్తం 21 గేట్లలో వద్ద ప్యార్లల్సిస్మిక్ టెస్టులను CWPRS చేసింది. ఇందులో 16 గేట్ల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని తేలింది. 26,27, 29, 30,31, 32, 33, 34, 35, 38, 40, 42,43,44, 45, 46 గేట్ల వద్ద నాణ్యత పాటించలేదని రిపోర్ట్ ఇచ్చింది. మిగతా గేట్లకు ఇబ్బంది లేదని తెలిపింది. ఆయా గేట్ల వద్ద ప్లెయిన్ కాంక్రీట్, ఆర్సీసీని నాసిరకగా తయరు చేసి రాఫ్ట్​, సీకెంట్​పైల్స్ అంటే బ్యారేజీ పునాదిని నిర్మించినట్లు ఆ రిపోర్ట్ చెబుతోంది. ఈ రిపోర్ట్ ను గత ఆగస్టులో CWPRS నీటి పారుదల శాఖకు అందించింది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు