Pastor Praveen: ప్రవీణ్ ప్రాణాలు తీసిందెవరు?.. అంత్యక్రియల్లో హైటెన్షన్-VIDEO

రాజమండ్రిలో అనుమానాస్పద రీతిలో చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలు మరికొన్ని గంటల్లో సికింద్రాబాద్ లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా క్రైస్తవులు, పాస్టర్లు తరలివచ్చారు. ప్రవీణ్ ను చంపిందెవరో తేల్చాలని.. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు..

New Update

రాజమండ్రి దగ్గర అనుమానాస్పద స్థితిలో పాస్టర్ ప్రవీణ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రవీణ్‌ భౌతికకాయాన్ని సికింద్రాబాద్ కు తరలించారు. సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ఆయన భౌతిక కాయాన్ని సాయంత్రం 4 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంచారు. దీంతో భారీగా పాస్టర్లు, క్రైస్తవులు, ప్రవీణ్‌ అభిమానులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా సెంటనరీ బాప్టిస్ట్ చర్చి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా తరలివచ్చిన పాస్టర్లు అక్కడ ఆందోళనకు దిగారు. ప్రవీణ్‌కు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు