హైదరాబాద్‌లో మరోసారి కూల్చివేతలు.. గుండెల్లో గుబులు!

TG: మైలార్‌ దేవుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. TNGOS కాలనీలో రెవెన్యూ అధికారులు అక్రమానిర్మాణాలను కూల్చివేస్తున్నారు. బాధితులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నిరసనల కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

New Update

Hydra: మైలార్‌ దేవుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. TNGOS కాలనీలో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు.  సర్వే నంబరు 156/1 లోని ప్రభుత్వం స్థలంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి పత్రాలు, అనుమతులు చూపించకపోవడంతో ఆక్రమణలు రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో బాధితులకు , రెవెన్యూ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. కూల్చివేతలను బాధితులు  అడ్డుకున్నారు. జేసీబీ తన మీద నుంచి పోనియ్యమంటూ యువతి హల్‌చల్‌ చేసింది. జేసీబీపై రాళ్లతో దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  లక్షల రూపాయలు పెట్టి స్థలాన్ని కొన్నామని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సంచలన ప్రకటన చేసే ఛాన్స్!

ఇది కూడా చదవండి: షర్మిల, విజయమ్మకు జగన్ షాక్.. పిటిషన్!

ఫుట్ పాత్ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్...

ఇటీవల  హైడ్రా మరో సంచలన కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లను ఆకమ్రించిన శాశ్వత దుకాణాలను తొలగించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్య, పాదచారులకు రక్షణ లేకుండా పోతుందనే ఆలోచలనలో హైడ్రా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల జనాలు రోడ్లపై నడుస్తున్నారు. దీని ద్వారా కొందరు ప్రమాదానికి గురవడంతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతోంది. దీనిపై నిన్న ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ కార్యాలయంలో అదనపు కమిషనర్‌ పీ విశ్వప్రసాద్‌తో కలిసి ఏవీ రంగనాథ్‌ ట్రాఫిక్‌ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కాగా అక్రమదారులకు ముందుగానే సమాచారం ఇచ్చి ఈ కార్యాచరణను ప్రారంభించనున్నట్లు రంగనాథ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: 80 విమానాలకు బాంబు బెదిరింపులు

ట్రాఫిక్ పోలీసులతో DRF...

పైలెట్ ప్రాజెక్ట్ కింద తొలుత హైదరాబాద్ నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో దీన్ని షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌  బృందాలు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పని చేసేలా కార్యాచరణ రూపొందించారు. కాగా డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, టెలిఫోన్‌ వైర్లు, జీహెచ్‌ఎంసీ చెత్త డబ్బాలనూ ఆయా విభాగాలు తొలగించే బాధ్యతను తీసుకోనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో హై టెన్షన్.. ఆ నిర్మాణం కూల్చివేసిన ఆందోళనకారులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు