BREAKING: కేసీఆర్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు! TG: కేసీఆర్ కనిపించడం లేదని గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు. కేసీఆర్ కు గజ్వేల్ ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని ఫిర్యాదులోపేర్కొన్నారు. By V.J Reddy 06 Oct 2024 in తెలంగాణ మెదక్ New Update షేర్ చేయండి KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ కేసీఆర్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు. ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని గజ్వేల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసీఆర్ కు గజ్వేల్ ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని ఫిర్యాదులోపేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేను వెతికి పెట్టి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు. పది నెలల నుండి కనిపించడం లేదు.. గజ్వేల్ నియోజకవర్గం నుండి కేసీఆర్ ను తమ ప్రజలు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. ఇక్కడి నుండి గెలిచిన తరువాత ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు కేసీఆర్ సీఎం అయ్యారన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించి ప్రతిపక్ష నాయకుని హోదా కల్పించారని లేఖలో పేర్కొన్నారు. అయితే.. గత 10 నెలల నుండి తమ ఎమ్మెల్యే కేసీఆర్ ఎక్కడ ఉన్నారనే జాడ కనిపించడం లేదన్నారు. తమ ప్రజల బాధలు చెప్పుకోవడం కోసం వారిని కలవడానికి ఎక్కడో ఎక్కడో వెతికామన్నారు. కానీ వారి ఆచూకీ ఎక్కడ దొరకలేదన్నారు. తమ గజ్వేల్ ప్రాంత ప్రజలు కేసీఆర్ పై గంపెడు ఆశతో గెలిపించుకుంటే.. నియోజకవర్గ ప్రజా సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ రకకై ఎదురుచూస్తూ చాలా ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు, డబుల్ బెడ్ రూంలు ఇప్పిస్తామని చెప్పి.. వారి హామీలు నెరవేరక ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి తమ గజ్వేల్ ప్రాంత ప్రజల సమస్యలు శాసన సభలోనైనా ప్రశ్నిస్తారని అనుకున్నామన్నారు. కానీ శాసనసభకు కూడా ముఖం చాటేసి తప్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యే కేసీఆర్ ఎక్కడున్నా ఆచూకీ కనుగొని తమ ముందుకు తీసుకు రావాలని గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో శ్రీకాంత్ రావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి