నేషనల్‌ హైవే పై ఘోర ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన లారీ!

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్‌ హైవే 65పై లారీ లారీ ఢీకొన్నాయి. సదాశివపేట బైపాస్‌ వద్ద లారీ టైర్‌ పంక్చర్‌ కావడంతో పక్కనే ఆపి టైర్‌ మార్చుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడే మృతి చెందారు.

New Update

Medak Road Incident: మెదక్ సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ నేషనల్‌ హైవే 65పై నిలిపి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. అయితే సదాశివపేట బైపాస్‌ రోడ్డు వద్ద  లారీ టైర్‌ పంక్చర్‌ కావడంతో.. బండిని పక్కనే ఆపి డ్రైవర్ టైర్ మార్చుతున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడిక్కడే మృతి చెందారు. మరో డ్రైవర్ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. 

Also Read:  దీపావళి ధమాకా.. బిగ్ బాస్ లో సెలెబ్రెటీల సందడి.. ప్రోమో చూసేయండి

అన్నమయ్య జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం 

ఇది ఇలా ఉంటే ఇటీవలే అన్నమయ్య జిల్లాలో ఆటోను బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే ఐదుగురు మృతి చెందారు. బంధువు అంత్యక్రియలకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నవారిని ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

కలికిరి మండలం చండ్రావారిపల్లె పంచాయతీ దూదేకులపల్లెకి చెందిన బంధువులు అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆటోలో వెళ్లారు. తిరిగి గ్రామానికి వస్తుండగా ఇందిరమ్మ కాలనీ సమీపంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఫకీర్‌బీ (55), బుజ్జమ్మ (50), ఖాదర్‌వలీ (35), చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమందకు చెందిన ఆటో డ్రైవర్‌ నూరుల్లా మృతి చెందారు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పుష్ప2 క్రేజ్.. ఏకంగా 11,500 స్క్రీన్స్‌లో రిలీజ్.. RRR రికార్డ్స్ బ్రేక్

Also Read:  అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా

Advertisment
Advertisment
తాజా కథనాలు