కొడంగల్ కోర్టుకు నరేందర్ రెడ్డి.. న్యాయస్థానం కీలక ఆదేశాలు!

కొడంగల్ లో కలెక్టర్ పై దాడి ఘటనలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు జైలుకు తరలిస్తున్నారు. ఈ దాడికి ఆయన కుట్ర చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

New Update

కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు కొడంగల్ లోని కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయనకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను జైలుకు తరలిస్తున్నారు. కలెక్టర్ సహా ప్రభుత్వ అధికారులపై దాడికి నరేందర్ రెడ్డి కుట్ర చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో ఆయనను అరెస్ట్ చేశారు. 

కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత..

అయితే నరేందర్ రెడ్డిని కోర్టుకు తరలిస్తున్న సమయంలో కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నరేందర్ రెడ్డిని తరలిస్తున్న కారును బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు