Maoists Surrenders : సమసమాజ నిర్మాణమే ధ్యేయమనే లక్ష్యంతో ఆయుధాలు పట్టి అడవుల్లో పోరాడుతున్న మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు వరుస ఎన్‌కౌంటర్లతో పలువురు మావోలు మృత్యువాత పడుతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. తాజాగా వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!
ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మావోయిస్టులకు రివార్డులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ బీజాపూర్ ప్రాంతం గుత్తికోయ కమ్యూనిటికి చెందిన వారని తెలిపారు. తెలంగాణ పోలీసులు కల్పించిన అవహాగాహనతో వీరంతా తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 250 మంది మావోయిస్టులు లొంగిపోతే వారిలో 90 శాతం మంది ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని చెప్పారు. వారందరూ ఇక మీదట మావోయిస్టులకు సహకరించమని తేల్చి చెప్పారన్నారు. వారికి అందజేసిన రివార్డులతో స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
ఇక ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ లో తెలంగాణ పోలీసుల ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ కూంబింగ్ ఛత్తీస్ గఢ్, కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ అన్నారు. ఈ విషయంలో మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదన్నారు. తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్ ప్రమేయం లేదన్నారు. కర్రెగుట్ట ఘటనలో మావోయిస్టులు ఎవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అనే విషయంలో స్పష్టత లేదని తేల్చి చెప్పారు.
Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!