BIG BREAKING: కవితకు TRS.. అదిరిపోయే శుభవార్త చెప్పిన EC!

కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఆమె స్థాపించబోయే కొత్త పార్టీకి తెలంగాణ రక్షణ సేన (TRS) పేరును ఖరారు చేయాలంటూ చేసుకున్న దరఖాస్తుకు ఆమోదం తెలిపింది. దీంతో ఆమె పార్టీ పేరు టీఆర్ఎస్ గా కన్ఫామ్ కానుంది.  

New Update
BRS Party (1)

కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఆమె స్థాపించబోయే కొత్త పార్టీకి తెలంగాణ రక్షణ సేన (TRS) పేరును ఖరారు చేయాలంటూ చేసుకున్న దరఖాస్తుకు ఆమోదం తెలిపింది. దీంతో ఆమె పార్టీ పేరు టీఆర్ఎస్ గా కన్ఫామ్ కానుంది. ఈ నెల 25న కవిత మేడ్చల్ లో కొత్త పార్టీని ప్రకటించింది. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన అని వెల్లడించింది. అయితే.. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంపై అభ్యంతరం తెలిపే అవకాశం ఉందన్న చర్చ సాగింది. తమ పార్టీ పేరు గతంలో TRS కావడంతో ఇబ్బందులు వస్తాయని వారు అప్పీల్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. మరికొందరు కూడా టీఆర్ఎస్ వచ్చేలా ఇప్పటికే పార్టీలను రిజిస్టర్ చేశారు. వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కవితకు TRS వచ్చే ఛాన్స్ లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఎట్టకేలకు తెలంగాణ రక్షణ సేన పేరుకు ఈసీ ఓకే చెప్పింది. అయితే తెలంగాణ రాష్ట్ర సేనగా తన పార్టీ పేరును ప్రకటించిన కవిత రక్షణ సేనగా మార్చుకున్నారు. ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు