జూబ్లీహిల్స్ కో ఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలకు బ్రేక్

జూబ్లీహిల్స్ కో ఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలకు బ్రేక్ పడింది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలను వాయిదా వేశారు. 

New Update
BREAKING

BREAKING

జూబ్లీహిల్స్ కో ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలకు బ్రేక్ పడింది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలను వాయిదా వేశారు. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రేపు అంటే ఏప్రిల్ 5న ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. మొత్తం 4 వేలకు పైగా ఓటర్లు ఈ సొసైటీలో ఉన్నారు. బొల్లినేని రవీంద్ర నాథ్, బొల్లినేని శ్రీనయ్య ప్యానల్స్ ఈ ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితరులు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు