Hydra: హైడ్రా సంచలన నిర్ణయం

హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా కట్టడి చేయనుంది. రెండు రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశం కానున్నారు. ఇప్పటికే దీనిపై బ్యాంకర్లకు హైడ్రా చీఫ్ లేఖ రాశారు. భేటీ అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.

New Update
HYDRA: అప్పటివరకు కూల్చివేతలకు బ్రేక్.. కారణమిదే!

Hydra: హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా కట్టడి చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది. రెండు రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశం కానున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. బఫర్ జోన్, FTL జోన్లల్లో అక్రమ నిర్మాణాలను కట్టడి చేయనుంది. బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలను హైడ్రా ఇవ్వనుంది. ఇందుకోసం ప్రత్యేకమైన లీగల్ టీం సైతం ఏర్పాటు చేశారు రంగనాథ్. ఇటీవల కూల్చిన భవనాలు, వెల్లాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల జాబితాను హైడ్రా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చెరువుల్లో నిర్మాణాలకు లోన్లు ఇవ్వడంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. 

చర్యలు తీసుకుంటాం...

అమీన్‌పూర్ మున్సిపాలిటీలో మళ్లీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. హైడ్రా తరహాలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం మోపుతున్నారు. సర్వే నెంబర్ 993లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన ఏడు నిర్మాణాలను నేలమట్టం చేశారు. సరైన అనుమతులు లేకుండానే నోటరీ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నాం అని అమీన్‌పూర్ తహశీల్దార్ తెలిపారు.

2022 నుంచి రెవెన్యూ శాఖ పోరాటం చేస్తోందని తహశీల్దార్ రాధ చెప్పారు. పలుమార్లు కూల్చినా యజమానులు పట్టించుకోలేదని అన్నారు. కిష్టారెడ్డిపేటలో 164 సర్వే నెంబర్‌లో మూడు భారీ భవనాలు, పటేల్‌గూడలో సర్వే నెంబర్ 12, 208లో అక్రమంగా నిర్మించిన 26 ఇళ్లను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. మరో ఐదు ఇళ్లలపై చర్యలు తీసుకుంటాం అని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు