ఉద్రిక్తతకు దారి తీసిన హైడ్రా అధికారుల సర్వే

TG: హైడ్రా అధికారుల సర్వే ఉద్రిక్తతకు దారిన తీస్తోంది. ఎక్కడికక్కడ అధికారులను బాధితులు అడ్డుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమకు సీఎం అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

New Update
HYDRAX

Hydra: హైడ్రా అధికారుల సర్వే ఉద్రిక్తతకు దారిన తీస్తోంది. ఎక్కడికక్కడ అధికారులను బాధితులు అడ్డుకుంటున్నారు. హైడ్రా బాధితుల కోసం కొత్తపేటలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్  ధర్నాకు దిగారు. ఈటల చేపట్టిన ధర్నాకు బాధితులు భారీగా తరలివచ్చారు. మరోవైపు 5 బృందాలుగా విడిపోయి అధికారులు సర్వే చేస్తున్నారు. ముసారంభాగ్, సత్యనగర్‌, వినాయక్‌నగర్‌, వీవీనగర్‌, భవానీనగర్‌, నాగోల్‌ వైపు గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా ఇళ్లకు మార్కింగ్‌ చేస్తున్నారు. బిల్డింగ్‌ ఉన్న వాళ్లకు డబుల్‌ బెడ్రూం కేటాయిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 30 ఇళ్లకు మార్కింగ్‌ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 8 ఇళ్లకు మార్కింగ్‌ పూర్తి చేశారు అధికారులు.

హైడ్రా బాధితుల ధర్నా..

హైడ్రా బాధితుల ధర్నా ఉద్రిక్తతగా మారింది. తమకు న్యాయం చేయాలని లంగర్ హౌస్ ఠాణా పరిధిలో రింగ్ రోడ్డుపై డిఫెన్స్ కాలనీ వాసులు బైఠాయించారు. ఈ క్రమంలో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమకు అన్యాయం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఎంత నచ్చజెప్పినా వినకుండా రోడ్డపైనే బాధితులు బైఠాయించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు