చిట్టీల పేరుతో మోసం.. 300 కోట్లు నొక్కేశారు... ఎక్కడంటే!

గచ్చిబౌలిలోని 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేటే లిమిటెడ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో జనాలను మోసం చేసింది. డబుల్​గోల్డ్​ స్కీమ్, బై బ్యాక్​ ఓపెన్​ప్లాట్​ స్కీమ్, చిట్టీల పేరుతో సుమారు 3,600 మంది నుంచి రూ.300 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది.

New Update
Gachibowli scam

Gachibowli scam

Gachibowli scam:  స్కీములు కాదు స్కామ్‌లు.. ప్రజలను నట్టేట ముంచే మోసాలు.. అసలు ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్థంకావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ల పేరుతో ఎంతోమంది అమాయక ప్రజలను నట్టేట ముంచుతున్నారు.  ఇలా కోట్లకు కోట్ల డబ్బును నొక్కేస్తున్నారు కొందరు స్కామర్లు. ఇప్పుడు ఇలాంటి ఘటనే  గచ్చిబౌలిలో చోటుచేసుకుంది.  డబుల్​గోల్డ్​ స్కీమ్, బై బ్యాక్​ ఓపెన్​ప్లాట్​ స్కీమ్,  చిట్టీల పేరుతో సుమారు 3,600 మంది నుంచి రూ.300 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది ఓ కంపెనీ. 

300 వందల కోట్ల స్కామ్ 

కూకట్​పల్లి కైత్లాపూర్​లోని రెయిన్​ బో విస్టాస్​లో కలిదిండి పవన్​ కుమార్ నివాసం ఉంటున్నాడు. అయితే ఇతను కొంతకాలం క్రితం మాతృశ్రీ నగర్​లో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేటే లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీకి సత్యనారాయణ, హరికృష్ణ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టగా.. భాస్కర్​రెడ్డి, రవికుమార్​రెడ్డి, జ్యోతి, మౌనిక, లావణ్య అసొసియేట్లుగా ఉన్నారు. 

జనాలను ముంచేందుకు మూడు స్కీములు 

అయితే పవన్ కుమార్ ఈ కంపెనీలో డబుల్​గోల్డ్​ స్కీమ్, బై బ్యాక్​ ఓపెన్​ప్లాట్​ స్కీమ్,  గోల్డ్ చిట్టీల  పేరుతో మూడు స్కీంలను తీసుకొచ్చాడు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని జనాలను నమ్మించాడు. అలాగే కంపెనీలోని తోటి అనుచరులకు కస్టమర్లను జాయిన్ చేస్తే కమీషన్ ఇస్తానని ఆశ పెట్టాడు. పవన్ చెప్పినట్లుగానే అతని అసోసియేట్లు జనాలను మంచి మంచి లాభాల పేరుతో నమ్మించారు. డబుల్ గోల్డ్ స్కీమ్ లో రూ. 4లక్షలు పెడితే , 12 నెలల తర్వాత రూ. 8 లక్షలు విలువ చేసే గోల్డ్ బిస్కెట్ ఇస్తామని..  గోల్డ్ చిట్టి స్కీమ్ లో 5 లక్షలు పెడితే.. 3% ఇంట్రెస్ట్ తో ప్రతీనెల రూ. 15వేల చొప్పున  19 నెలల పాటు వస్తాయని చెప్పారు.

అలాగే బై బ్యాక్​ ఓపెన్​ ప్లాట్​ స్కీమ్​లో రూ.8.8 ఇన్వెస్ట్ చేస్తే.. 2 గుంటల భూమిని రిజిస్ర్టేషన్​ చేయడంతో పాటు 4% ఇంట్రెస్ట్ ఇస్తామని.. దాంతో పాటు ప్రతినెలా రూ.32 వేల చొప్పున 25 నెలల పాటు డబ్బులు చెల్లిస్తామని జనాలను నమ్మిచారు. ఇవ్వన్నీ నిజమని నమ్మిన చాలా మంది పవన్ కంపెనీలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేశారు. సుమారు 3,600 మంది నుంచి రూ.300 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశారు.  ఈ సైబరాబాద్​ ఎకనామిక్​ అఫెన్సెస్​ వింగ్​  పోలీసుల దృష్టికి వెళ్లడంతో 12 వెల్త్​ క్యాపిటల్​ సర్వీసెస్​ ప్రైవేట్​లిమిటెడ్​కంపెనీ ఎండీ పవన్ తో పాటు అతని ఏడుగురు అనుచరులను అరెస్టు చేశారు. 

Also Read: పెళ్ళైన నాలుగు నెలలకే రాధికా ఆ విషయంలో సంచలన నిర్ణయం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు