/rtv/media/media_files/2025/03/21/8AlFdQcpkKfPyaADthA7.jpg)
తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట లభించింది. బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో యాంకర్ శ్యామల పిటిషన్ వేశారు. దీనిపై నేడు కోర్టులో విచారణ జరిగింది. శ్యామలను అరెస్టు చేయవద్దంటూ ఈ సందర్భంగా న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలను హైకోర్టు ఆదేశించింది. సోమవారం నుంచి పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
Also read : వారేవా పాకిస్థాన్.. న్యూజిలాండ్కు చుక్కలు చూపించింది!
Also read : ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. రాచకొండ సీపీ కీలక ఆదేశాలు!
👉 హైకోర్టులో యాంకర్ శ్యామలకు ఊరట
— ANN Telugu (@AmmanewsL) March 21, 2025
👉 శ్యామల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
👉 శ్యామలను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశం
👉 సోమవారం పోలీసుల విచారణకు హాజరుకావాలన్న తెలంగాణ హైకోర్టు
👉 విచారణకు సహకరించాలని శ్యామలకు ఆదేశం#Shyamala #Tollywood #BettingApps #HighCourt #bail #Telangana pic.twitter.com/HoRBMP154Z
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు
కాగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు గానూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలతో పలువురిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. శ్యామలతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో యాంకర్ విష్ణుప్రియ, రీతూచౌదరీలు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. యాంకర్ శ్యామల కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె హాజరుకాకుండా హైకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు బెట్టింగ్ ప్రమోషన్స్ ను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన కేసులపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఏడాదిలో 25 మంది బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నమోదైన కేసుల ఆధారంగా ఆయా బెట్టింగ్ యాప్స్ ను గుర్తించే పనిలో పడ్డారు.
Also Read : కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
Also read : భద్రాచలం ఈవో వర్సెస్ అర్చకులు ప్రభుత్వం సీరియస్