MLA Arikepudi Gandhi: అరికెపూడి ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్

MLA అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కండువా కప్పేందుకు మీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి చేసిన సవాల్‌కు నేనే మీ ఇంటికి వస్తానని గాంధీ ప్రతిసవాల్‌ చేశారు.

author-image
By V.J Reddy
New Update
MLA Arikepudi Gandhi

MLA Arikepudi Gandhi: ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అరికెపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అరికెపూడి తెలంగాణ భవన్‌కు రావాలని నిన్న కౌశిక్‌రెడ్డి డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. నువ్వు తెలంగాణ భవన్‌కు రాకుంటే నేనే నీ ఇంటికి వచ్చి బీఆర్‌ఎస్ కండువా కప్పుతామని కౌశిక్‌రెడ్డి విమర్శలు చేశారు. ఇంటి ముందు బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని చెప్పాడు.

కౌశిక్ కు గాంధీ కౌంటర్...

కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరికెపూడి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "నువ్వు 11 గంటలకు వస్తా అన్నావు.. రాకుంటే నీ ఇంటికే వస్తా.. నా ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు అవసరం లేదు. నీ దమ్ము ఏంటో.. నా దమ్ము ఏంటో తేల్చుకుందాం" అని సవాల్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేపాయి. పార్టీ మారిన 10 మందికి చీరలు, గాజులు కొరియర్‌ చేస్తామని కౌశిక్‌రెడ్డి అన్నారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్‌, అరికెపూడి, కాంగ్రెస్‌ మహిళా నేతలు. కౌశిక్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బండ్రు శోభారాణి. కౌశిక్‌రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు