మూసీ నిర్వాసితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: మూసీ నిర్వాసితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నిర్వాసితుల జీవనోపాధికి 14మందితో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా సెర్ఫ్‌ సీఈవోను నియమించింది.

New Update
Supreme Court: రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్

Musi River: మూసీ నిర్వాసితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నిర్వాసితుల జీవనోపాధికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా సెర్ఫ్‌ సీఈవోను నియమించింది. మొత్తం 14 మందితో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నిర్వాసితులకు జీవనోపాధి కల్పించడం కోసం కమిటీ నేతృత్వంలో అధ్యయనం నిర్వహించనుంది. మూసీ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కమిటీ వేసింది.

తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు..

మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని, వారందరికీ ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న వారందరికీ మంచి ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఈ విషయంలో కొందరు రెచ్చగొటే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని అన్నారు. మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదల కోసం ఈ ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొస్తోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీనిచ్చారు.

అందరి బాధ్యత...

హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నగరంలో 12 నుంచి 14 వందల ఫీట్ల లోతుల్లోకి బోరు వేస్తే తప్ప నీళ్లు పడే పరిస్థితి లేదని చెప్పారు. మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ ప్రజలు విషాన్ని దిగమింగుకుని బతుకుతున్నారు. నిరుపేదలను ఆదుకోవడానికి ప్రతిపక్ష నేతల సూచనలు కూడా తీసుకోవడానకి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ముఖ్యమంత్రి సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు