Ganesh Nimajjanam : నిమజ్జనానికి 600 స్పెషల్ బస్సులు.. వారికి ఫ్రీ! హైదరాబాద్ లో రేపు జరిగే గణేశ్ నిమజ్జన వేడుకలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులను ప్రకటించింది. జీహెచ్ఎంసీలోని అన్ని బస్సు డిపోల నుంచి 15-30 బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. స్పెషల్ బస్సుల్లో సైతం మహాలక్ష్మి స్కీం అమలులో ఉంటుంది. By Nikhil 16 Sep 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్ నిమజ్జన వేడుకలు, శోభాయాత్ర అంటేనే అందరికీ హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. ఇక్కడ జరిగే శోభాయాత్రను చూసేందుకు నగరం నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుచి భక్తులు భారీగా తరలివస్తారు. అయితే.. శోభాయాత్ర నేపథ్యంలో రేపు హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. దీంతో సొంత వాహనంలో ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లి నిమజ్జన వేడుకలను చూడడం చాలా కష్టం. ఒకవేళ కష్టపడి వెళ్లినా.. వాహనాలను పార్కింగ్ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. అయితే.. భక్తుల కోసం TGSRTC, మెట్రో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 17న గణేష్ నిమజ్జనోత్సవం, శోభయాత్ర సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా #TGSRTC యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వినాయక నిమజ్జన వేళ ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలకు 600 స్పెషల్ బస్సులను సంస్థ న… pic.twitter.com/DmuXGTReCN — VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) September 15, 2024 మైట్రో రైల్ సేవలను అర్థరాత్రి వరకు పొడిగించగా.. తాజాగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. GHMC పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15-30 బస్సులను నడపనున్నట్లు తెలిపింది. భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ సైతం ఈ బస్సుల్లో అందుబాటులో ఉంటుంది. మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి ఆయా స్పెషల్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి