కిషన్ రెడ్డిపై బీజేపీ నేతల తిరుగుబాటు.. వైరల్ అవుతోన్న వీడియోలు! TG: కిషన్ రెడ్డిని సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేశారు. ఆయనపై సొంత పార్టీ నేతల కోసం కాకుండా ఇతర పార్టీనేతల కోసం పనిచేస్తారంటూ కొన్ని వీడియోలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. By V.J Reddy 18 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Kishan Reddy: సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై వీడియోలు వైరల్ అవుతున్నాయి. కిషన్ రెడ్డి పార్టీలో ఎవరికి ఉపయోగపడడు... సొంత పార్టీ నేతల ఓటమి గురించి పని చేస్తాడని.. తన సొంత లోక్ సభ నియోజక వర్గంలో ఒక్క ఎమ్మెల్యేను గెలుపించుకొని అసమర్థ నాయకుడు.. పక్క పార్టీ నేతల గెలుపు కోసం కృషి చేస్తాడంటూ అగంతకులు వీడియోలు తాయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇది కూడా చదవండి: కేటీఆర్ పరువు నష్టం కేసు వాయిదా పోలీసులకు ఫిర్యాదు... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిషన్ రెడ్డి ఇమేజ్ ను దెబ్బతీసేలా వీడియోలు ఉన్నాయంటూ మండిపడుతున్నారు. తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఎస్ ప్రకాష్ రెడ్డి. కిషన్ రెడ్డి పై కుట్ర పూరితంగా ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు అ ను మా నం వ్య క్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు! సొంత పార్టీ నేతలేనా?... కాగా కిషన్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే ఇలాంటి వీడియోలు తాయారు చేస్తున్నారా? అనే అనుమానాలను బీజేపీ శ్రేణులు వ్యక్త పరుస్తున్నారు. ఎంతటి వారైనా వదిలే పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. దీనిపై వీడియోలు సైతం ఇచ్చేందుకు బీజేపీ నే త లు ఇ ష్ట పడడం లేదు. పెన్ డ్రైవ్ లో పెట్టీ పోలీసులకు ఇచ్చామని దాటేశారు కాషాయ పార్టీ నేతలు. కాగా ఇటీవల సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖ ట్రోలింగ్ కు గురైన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు! ఇది కూడా చదవండి: తమిళ మాజీ సీఎంకు పవన్ నివాళి.. వైరల్ అవుతున్న ట్వీట్! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి