BREAKING: టీడీపీలోకి బాబుమోహన్‌!

TG: మాజీ మంత్రి, నటుడు బాబుమోహన్‌ టీడీపీలో చేరారు. తాను ఆందోల్‌ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు  ముందు బాబు మొహం కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

New Update
BABU MOHAN.

Babu Mohan: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే.. జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేశారు బాబు మోహన్. తాజాగా ఆయన టీడీపీలో చేరినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆందోల్‌ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు పోస్ట్ చేశారు. బాబు మోహన్ తన రాజకీయ ప్రస్తావనను టీడీపీ నుంచే మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: 'రేవంత్‌ను చంపేందుకు కుట్ర'

కేఏ పాల్ కు హ్యాండ్...!

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాబుమోహన్ కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీలో చేరారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేయదని ప్రకటించిన కేఏ పాల్.. బాబు మోహన్ చేరికతో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. అలాగే తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ పగ్గాలను బాబు మోహన్ కు అప్పగించారు. ఎన్నికల్లో వరంగల్ నియోజకవర్గం నుంచి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బాబు మోహన్. అయితే.. ఇక్కడే ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసియాన్ నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేశారు. ఈ కారణంతో ఎన్నికలకు ఆయన దూరం అయ్యారు.

ఇది కూడా చదవండి: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు!

బాబు మోహన్ రాజకీయ సినిమా!

బాబుమోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందాడు.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు!

2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరాడు. బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్​ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిర‌ణ్ చేతిలో, 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా చేతిలో ఓడిపోయాడు. ఆయన 2023 ఫిబ్రవరి 7న సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీకి రాజీనామా చేసి అనంతరం మార్చి 04న ప్రజా శాంతి పార్టీలో చేరాడు. ఆ తరువాత తాజాగా తిరిగి తెలంగాణ టీడీపీలో చేరారు.

ఇది కూడా చదవండి:  బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు!

Advertisment
Advertisment
తాజా కథనాలు