సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు! TG: సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో స్వల్ప మార్పులు చేశారు. టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారిని సీఎం నివాసం వద్ద భద్రత విధుల్లో నుంచి తొలిగించారు. వారి స్థానంలో సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు(కార్) సిబ్బందిని నియమించారు. By V.J Reddy 29 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంపై పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం భద్రత విషయంలో స్వల్ప మార్పులు చేసింది. సీఎం నివాసం వద్ద భద్రత విధుల్లో ఉన్న తెలంగాణ ప్రత్యేక పోలీసు పటాలం(టీజీఎస్పీ) సిబ్బందిని తొలిగించింది. వారి స్థానంలో సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు(కార్) సిబ్బందిని నియమించింది. మొత్తం సీఎం నివాసం వద్ద విధులు నిర్వర్తిస్తున్న 22 మంది టీజీఎస్పీ సిబ్బందిని తొలిగిస్తు నిర్ణయం తీసుకుంది. ఇది కూడా చదవండి: బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు! కాగా గత కొన్ని రోజులుగా టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న టీజీఎస్పీ సిబ్బంది కూడా ఆందోళన చేసే అవకాశం ఉందనే సందేహంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆందోళన చేస్తున్న కొంత మంది సిబ్బందిని లో రాష్ట్ర పోలీసు శాఖ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: నేడు సొంత జిల్లాలో జగన్ పర్యటన ఆర్టికల్ 311కు విరుద్ధమని.. పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా ఆందోళనలు చేపట్టిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించింది. ఇప్పటికే 39 మందిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం వారిలో తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న 10 మందిని గుర్తించి.. ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పదిమంది బెటాలియన్స్ కానిస్టేబుళ్లలను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పదిమంది కానిస్టేబుళ్లు బెటాలియన్స్ లో అశాంతికి ప్రధాన కారణమయ్యారని డీజీపీ కార్యాలయం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ పదిమంది కానిస్టేబుల్ వల్లనే మిగతావాళ్లు ఆందోళనకు దిగారని పేర్కొంది. కానిస్టేబుల్ ఆందోళనకు ఈ పదిమంది కారణమయ్యారని తెలిపింది. యూనిఫామ్, క్రమశిక్షణ గల ఫోర్సులో ఆందోళనలు చేయడం ఆర్టికల్ 311కు విరుద్ధమని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలు చేయడం, న్యూస్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసి ఆందోళనలను ప్రేరేపించడం ఆర్టికల్ 311కు విరుద్ధమని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో 6లక్షల రేషన్ కార్డులు రద్దు! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి