8 మంది ఉన్నా.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఉగ్రరూపం!

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కవిత. రాష్ట్రం నుంచి 8మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. పరిశ్రమ కొరకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరారు.

New Update
KAVITHA

MLC Kavitha: కేంద్రంలో అధికారంలో బీజేపీపై విమర్శల దాడికి దిగారు ఎమ్మెల్సీ కవిత. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో బీజేపీ మొండి చేయి చూపిస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో ఒక్క పరిశ్రమకు కూడా బీజేపీ ప్రభుత్వం మద్దతుగా నిలవలేదని ఫైర్ అయ్యారు. 'బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు" అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్ లేఖ రాశారు...

తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు కవిత. లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయని అన్నారు. అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని వెల్లడించారు. 

కేంద్రంలో ఎవరు ఉన్న...!

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందే అని స్పష్టం చేశారు కవిత. 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ హామీని అమలు చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు. ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం సాకు చూపిస్తోందని మండిపడ్డారు. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ను ఛత్తీస్ ఘడ్ నుంచి తీసుకువచ్చేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారని అన్నారు.

8 మంది ఉన్న ఏం లాభం...

బీజేపీకి తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరం అని అన్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోచనీయం.. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారని.. కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని కోరారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

New Update
Rains

Rains

 Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


 ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Also read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Advertisment
Advertisment
Advertisment