గప్పాలు కొట్టే రేవంతు.. ఇకనైనా.. హారిష్ రావు ఫైర్!

TG: హామీలు నెరవేర్చకుండా సీఎం రేవంత్ గప్పాలు కొడుతున్నారని అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో 10 నెలలుగా అంగన్వాడి కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి నెలకొందన్నారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఆపాలన్నారు.

New Update
HARISH RAOO

MLA Harish Rao: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. ఒకటో తేదీనే జీతాలు అంటూ సీఎం చెప్తున్నారని చెప్పారు. 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీలకు జీతాలు రాలేదని గుర్తు చేశారు. 10 నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించలేదని చెప్పారు. విశ్రాంత ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తర్వులు ఉంటే తప్ప రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలబెట్టుకోండి అని సీఎం రేవంత్ కు సూచనలు చేశారు.

గప్పాలు కొట్టిన రేవంత్...

హరీష్ రావు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. "ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ గప్పాలు కొట్టిన సీఎం రేవంత్.. ఈనెల 14వ తేదీ వచ్చినా 39,568  మంది అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి. 10 నెలలుగా అంగన్వాడి కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి. ఏడాది కాంగ్రెస్ పాలనలో మీరు సాధించిన ఘనత ఇది. విశ్రాంత ఉపాధ్యాయులను, ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నావు. 

హైకోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని, వారి కుటుంబాలను క్షోభకు గురి చేస్తున్నావు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా లక్షల మంది సకాలంలో జీతాలు రాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపండి. ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలుపుకోండి." అని పోస్ట్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TS: సలేశ్వరానికి వేలల్లో భక్తులు..శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని సలేశ్వరం జాతన మొదలైంది. దీనికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో శ్రీశైలం హైవే వాహనాలతో నిండిపోయింది. అక్కడ ఆరు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. 

New Update
TS

Srisailam High way

 

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉండే సలేశ్వరం బాగా ఫేమస్. ఇక్కడ శివుడిని దర్శించుకోవడానికి భక్తులు విపరీతంగా వస్తారు. ఏడాది ఒకసారి చేసే జాతరకు విశిష్టత ఉండండతో ఈ సమయంలో భక్తులు పోటెత్తుతారు. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడు కూడా సలేశ్వర్ జాతరకు జనాలు వేలల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది. మన్ననూర్‌ చెక్‌పోస్టు వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్‌  చెల్లించే క్రమంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో చెక్‌పోస్టు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే ట్రాఫిక్ ను వాలంటీర్లు, అటవీశాఖ కంట్రోల్ చేస్తోంది. 

లింగమయ్య స్వామి జాతర..

ప్రతీ యేడూ చైత్ర పోర్ణమి సందర్భంగా సలేశ్వరంలో మూడు రోజుల పాటూ లింగమయ్య స్వామి జాతర జరుగుతుంది. దీనికోసం భక్తులు చాలా దూరం కాలి నడకన వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా కష్టమైన మార్గంలో. అయినా కూడా భక్తులు ఎంతో శ్రద్ధగా, నిష్టగా ఇక్కడకు వెళుతుంటారు. ప్రస్తుతం ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.

 today-latest-news-in-telugu | srisailam | high-way | trafficjam

Also Read: Supreme Court: రాష్ట్రపతి బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
Advertisment