రేవంత్ పతనం కొడంగల్ నుంచే స్టార్ట్ చేస్తా: పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో!

రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుండే మొదలు పెడతానని లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కోర్టుకు హాజరైన సమయంలో తనను కలిసిన వారితో మాట్లాడారు.

author-image
By Nikhil
New Update
Patnam Narender Reddy

రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుండే మొదలు పెడతానని లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టుకు హాజరైన సమయంలో తనను కలిసిన వారితో మాట్లాడారు. రైతులకు మద్దతిస్తే తన మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం అవుతోంది. తన అరెస్ట్ పై నరేందర్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. అయితే.. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను ఏమైనా పరారీలో ఉన్నాడా? అని ప్రశ్నించింది. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచింది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే అంశం ఉత్కంఠగా మారింది. 

ఇది కూడా చదవండి: వారిని పక్కాగా ఊచలు లెక్కబెట్టిస్తా.. వరంగల్ లో రేవంత్ సంచలన స్పీచ్

ఇది కూడా చదవండి: చెత్త వేస్తే చలానా.. ఫొటో తీసి మరీ పట్టుకుంటారు.. GHMC నయా యాప్ రెడీ!

వికారాబాద్ జిల్లా కోర్టులో నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. అయితే.. నరేందర్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కస్టడీ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. మరో వైపు ఆయన కస్టడీ పిటిషన్ పై ఈ రోజు తీర్పు వెల్లడించనుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు