/rtv/media/media_files/2025/02/03/GaoJwl8ruDqNU0NVlJfA.jpg)
BJP
అదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ అత్యధిక వార్డులను కైవసం చేసుకుని మున్సిపాలిటీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని మొత్తం 49 వార్డులకు గానూ బీజేపీ ఏకంగా 21 వార్డులలో జయకేతనం ఎగురవేసింది. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌కు అతి సమీపంలోకి చేరుకుంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ 11 వార్డులకు మాత్రమే పరిమితం కాగా, గతంలో బలంగా ఉన్న బీఆర్‌ఎస్ కేవలం 6 వార్డులనే గెలుచుకుని మూడో స్థానానికి పడిపోయింది. స్వతంత్రులు మరియు ఇతరులు కలిపి 11 వార్డులలో విజయం సాధించారు.
బీజేపీకి 21 సీట్లు రావడంతో, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించడానికి మరో నలుగురు సభ్యుల మద్దతు అవసరం కానుంది. స్వతంత్రులుగా గెలిచిన అభ్యర్థులు ఇప్పుడు కీలకంగా మారారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోవడంతో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్‌లో గెలుపు గుర్రాలెవరో తేలిపోవడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
Follow Us