5 వ రోజు అట్ల బతుకమ్మ.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి?

బతుకమ్మ 9 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రేపు 5వ రోజు అంటే అట్ల బతుకమ్మ. అట్ల బతుకమ్మ రోజున నానబెట్టిన బియ్యంతో అట్లు తయారు చేసి గౌరీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ముతైదువులు ఈ అట్లను ఒకరికొకరు వాయనంగా అందించుకుంటారు.

New Update
bathukamma 1

Bathukamma 2024

Bathukamma 2024 : తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అచ్చ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ పండగను జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు కోలాహలంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో..  ఆడబిడ్డలు రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి.. ఆటపాటలు, బొడ్డెమ్మలతో అమ్మను ప్రసన్నం చేసుకుంటారు. ఈ పండగ వేల ప్రతి ఇళ్ళు ఆడబిడ్డల చిరునవ్వులు, బంధుమిత్రుల కోలాహలాలతో కళకళలాడుతూ ఉంటుంది. 

Also Read: దుమ్మురేపుతున్న శివజ్యోతి 'నగాదారిలో' బతుకమ్మ సాంగ్.. చూశారా?

తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో రూపంలో గౌరీ దేవిని పూజిస్తారు. ఇప్పటికే నాలుగు రోజుల బతుకమ్మ వేడుకలు పూర్తయ్యాయి. రేపు ఐదవ రోజు.. అంటే అట్ల బతుకమ్మ. అట్ల బతుకమ్మ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం 

అట్ల బతుకమ్మ ప్రత్యేకతలు 

అట్ల బతుకమ్మ రోజున బియ్యం పిండి, రవ్వతో అట్లను తయారు చేసి.. ఈ అట్లను గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముతైదువులు తాము దేవతకు సమర్పించిన అట్లను ఒకరికొకరు వాయినంగా ఇచ్చి పుచ్చుకుంటారు. ఐదవ రోజు కూడా ప్రతీ రోజు వలే ఇల్లంతా శుభ్రం చేసుకుని.. తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు, చామంతి పూలు, మందారం, గుమ్మడి పూలతో బతుకమ్మను అందంగా పేరుస్తారు. 

తొమ్మిది రోజులు గౌరీ దేవిని ఈ పేర్లతో పూజిస్తారు 

మొదటి రోజు:  ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు: అటుకుల బతుకమ్మ, మూడవ రోజు: ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు, నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు: అట్ల బతుకమ్మ, ఆరవ రోజు: అలిగిన బతుకమ్మ ,  ఏడవ రోజు: వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు: వెన్నెల ముద్దల బతుకమ్మ,  తొమ్మిదవ రోజు: సద్దుల బతుకమ్మ.. ఇలా తొమ్మిది రోజులు బతుకమ్మను తొమ్మిది పేర్లతో పూజిస్తారు. 

Also Read: 'మా ఇంట మహాలక్ష్మి పుట్టింది'.. తల్లిదండ్రులైన రాకింగ్‌ రాకేష్, సుజాత

Advertisment
Advertisment
తాజా కథనాలు