Telangana Weather: తెలంగాణలో ఈరోజు, రేపు వర్షాలు కురిసే ఛాన్స్! ఈరోజు రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అలాగే, దక్షిణాది రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. By KVD Varma 23 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rain Alert To Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం వర్షాలు కురిశాయి. అక్కడక్కడా భారీ వర్షపాతం నమోదు అయింది. ఇక ఈరోజు, రేపు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో అత్యధికంగా 13.10 సెంటీమీటర్ల వర్షం శనివారం నమోదు అయింది. అదే విధంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 4.7 నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో 4.4, సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో 4.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండిలో 13 సెంటీమీటర్లు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో 12.2 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. ఇక ఆది, సోమ వారాల్లో పలుజిల్లాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షం కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళలోని మల్లాపురం జిల్లాలో రెడ్ అలర్ట్, మరో ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఏఎన్ఐ నివేదించింది. కేరళ - మహేలలో అతి భారీ (64.5-115.5 మి.మీ) నుండి భారీ వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ చెప్పింది. మరాఠ్వాడా, మహే, లక్షద్వీప్ ప్రాంతాలు చాలా విస్తృతంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD రిపోర్ట్ చెబుతోంది. IMD ప్రకారం, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి - కారైకాల్‌లో రాబోయే ఐదు రోజులలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. Also Read: జూలై 1 నుంచే నెలకు రూ.2500.. మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త! #weather-updates #rain-alert-in-ts #weather-report మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి