IRCTC Telangana Tour Package: తెలంగాణ టూర్ ప్యాకేజిని ప్రకటించిన ఐఆర్సీటీసీ..ప్యాకేజ్ రేట్ ఎంత..?ఎలా బుక్ చేయాలంటే!! తెలంగాణ టూర్ తో పాటు హైదరాబాద్ లోకల్ టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ లోని టూరిస్ట్ స్పాట్స్ ను కవర్ చేస్తూ.. హైలైట్స్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో ఈ ప్యాకేజ్ ను ప్రకటించడం జరిగింది. ఇక టేస్ట్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఐఆర్సీటీసీ ప్రకటించిన టూర్లో త్రీ నైట్స్..4 డేస్ టూర్ ప్యాకేజ్ ఉంటుంది. By P. Sonika Chandra 25 Aug 2023 in తెలంగాణ New Update షేర్ చేయండి IRCTC Telangana Tour Package: తెలంగాణ టూర్ తో పాటు హైదరాబాద్ లోకల్ టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ (IRCTC) ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ లోని టూరిస్ట్ స్పాట్స్ ను కవర్ చేస్తూ.. హైలైట్స్ ఆఫ్ హైదరాబాద్ (IRCTC Highlights of Hyderabad) పేరుతో ఈ ప్యాకేజ్ ను ప్రకటించడం జరిగింది. ఇక టేస్ట్ ఆఫ్ తెలంగాణ (IRCTC Taste of Telangana Tour package)పేరుతో ఐఆర్సీటీసీ ప్రకటించిన టూర్లో త్రీ నైట్స్..4 డేస్ టూర్ ప్యాకేజ్ ఉంటుంది. ఇది ప్రతీ ఆదివారం,సోమవారం, బుధవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజ్ హైదరాబాద్ వాసులతో పాటు హైదరాబాద్ కు వచ్చే పర్యాటకులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. టూర్ ఎలా సాగుతుందంటే..! టేస్ట్ ఆఫ్ తెలంగాణ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న టూరిస్టులను ఫస్ట్ డే హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి ఐఆర్సీటీసీ సిబ్బంది పికప్ చేసుకుంటుంది. తరువాత హోటల్ లో చెకిన్ కావాలి. ఇక ఫస్ట్ డే చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం,లుంబినీ పార్క్ చూపిస్తారు. నైట్ హోటల్ లో స్టే ఉంటుంది. రెండో రోజు బిర్లామందిర్, గోల్కొండ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి తీసుకొని వెళతారు. మళ్లీ నైట్ హోటలోనే ఉండొచ్చు. ఇక థర్డ్ డే యాదాద్రి టూర్ (Yadadri Tour) ఉంటుంది. యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చూపిస్తారు. అక్కడి నుంచి సురేంద్రపురి సందర్శన ఉంటుంది. సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. నైట్ హోటల్ లోనే స్టే ఉంటుంది. అయితే నాలుగో రోజు ఉదయం మాత్రం హోటల్ నుంచి చెక్ అవుట్ కావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి పర్యాటకులను రామోజీ ఫిల్మ్ సిటీకి (Ramoji Film City) తీసుకొని వెళతారు. అక్కడ సందర్శన ముగిసిన తరువాత నేరుగా పర్యాటకుల్ని హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల దగ్గర డ్రాప్ చేయడంతో టేస్ట్ ఆఫ్ తెలంగాణ టూర్ ముగుస్తుంది. ప్యాకేజ్ రేట్ ఎంతంటే..! ఇక ఈ టూర్ ప్యాకేజ్ రేట్ విషయానికొస్తే.. ఆక్యుపెన్సీ ని బట్టి ఉంటుంది. ప్యాకేజీలో భాగంగా హోటల్ లో స్టే, బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి 11,410, డబుల్ ఆక్యుపెన్సీకి 13,080, సింగిల్ ఆక్యుపెన్సీకి 30,390, చెల్లించాల్సి ఉంటుంది. బుక్ చేయడానికి..! టేస్ట్ ఆఫ్ తెలంగాణ టూర్ ను బుక్ చేయడానికి https://www.irctctourism.com వెబ్ సైట్ ను లాగిన్ అయితే సరిపోతుంది. ఫుల్ డీటైల్స్ అందులో ఉంటాయి. Also Read: టీమిండియా టైటిల్ స్పాన్సర్ హక్కులు దక్కించుకున్న ఐడీఎఫ్‌సీ బ్యాంక్ #irctc-package #irctc-telangana-tour-package #irctc-hyderabad-package #irctc-tourism-package #irctc-highlights-of-hyderabad #irctc-highlights-of-hyderabad-package #irctc-tourism-introduces-taste-of-telangana-tour-package మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి