రైతులకు నిరంతర విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌ నేత యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అనీల్‌ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ పార్టీ కండువా కప్పీ వారిని బీఆర్‌ఎస్‌లోకి అహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేస్తున్న అభివృద్ధిని చేసి ఇతర పార్టీలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారన్నారు.

New Update
రైతులకు నిరంతర విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

CM KCR, BRS, inclusions, power sector, farmers

బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌ నేత యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అనీల్‌ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ పార్టీ కండువా కప్పి వారిని బీఆర్‌ఎస్‌లోకి అహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేస్తున్న అభివృద్ధిని చేసి ఇతర పార్టీలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని పనిని తమ ప్రభుత్వం చేసి చూపిస్తోందని సీఎం తెలిపారు. గతంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఎందుకు కరెంటు ఇవ్వలేకపోయిందని కేసీఆర్‌ ప్రశ్నించారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని కేసీఆర్‌ వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎన్నో కష్టాలు పడ్డారన్న కేసీఆర్.. గతంలో తమ ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ ఇస్తుందని చెబితే ఎవరూ నమ్మలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు వాటిని నిజం చేసి చూపామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్‌ సరఫరా చేస్తునామన్న కేసీఆర్‌.. ఈ స్థాయిలో రైతులకు విద్యుత్‌ను సరఫరా చేయాలంటే ఎంతో ధైర్యముండాలన్నారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఆగమైపోయిందని, తెలంగాణలో రైతుల పరిస్థితి మెరుగుపడిందని వివరించారు. పదేళ్ల విద్యుత్‌ విభాగంలో ఒక్క ఐఏఎస్‌ కూడా లేడని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎటు చూసినా వరికుప్పలే దర్శనమిస్తున్నాయన్నారు.

ప్రస్తుతం రైతు దగ్గరికి వచ్చి విద్యుత్‌ బిల్లులు అడిగే సాహసం చేసేవారు లేరని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయబోమని చెబితే తమ ప్రభుత్వం రైతులు నష్టపోవద్దని వారి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వారి వద్దకే వెళ్లి కొనుగోలు చేశామని గుర్తు చేశారు. రైతులను ఆదుకోని ప్రభుత్వం ఉంటే ఎంతా లేకుంటే ఎంతా అని సీఎం కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూస్తూ ఓర్వలేక నిధులు విడుదల చేయడం లేదన్న ఆయన.. తాను మోడీ కంటే మొండి వాడినని, అనుకున్నది సాధించే వరకూ ఏదీ వదలనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మరిన్ని రంగాల్లో ముందుకు వెళ్లబోతోందని, దానిని ప్రజలందరూ చూస్తుంటారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు