Telangana: గవర్నర్ పదవికి రాజీనామా? తమిళిసై ఏం చెప్పారంటే..!

తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై తమిళిసై స్పందించారు. అదంతా పుకార్లు అని కొట్టిపడేశారు. తెలంగాణ గవర్నర్‌గా సంతోషంగా ఉన్నానని చెప్పారు. కొందరు కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారం అని అన్నారు.

New Update
Tamilisai : కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదు.. తమిళిసై విమర్శలు

Telangana Governor: తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని మారుస్తున్నట్లు, ఆ పదవికి ఆమె రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై తమిళిసై స్పందించారు. రాజీనామాపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలన్నీ వట్టి పుకార్లు అని స్పష్టం చేశారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ గవర్నర్‌గా తాను సంతోషంగా ఉన్నానని.. గవర్నర్‌గా రాజీనామా చేసున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. కొందరు పనిగట్టుకుని మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దన్నారు. రాజీనామాకు సంబంధించి ఏదైనా నిర్ణయం ఉంటే అన్ని విషయాలు తానే తెలియజేస్తానని చెప్పారు గవర్నర్ తమిళిసై. రాజకీయాలు అనేది తన కుటుంబ నేపథ్యంలోనే ఉందని పేర్కొన్నారామె.

కాగా, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మళ్లీ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళిసై ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసమే హస్తినకు వెళ్లారనే వార్తలు వినిపించాయి. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపించాయి. ఇదిలా ఉండగా.. తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. మూడుసార్లు అసెంబ్లీకి పోటీ చేసినా.. ఆమె గెలుపు తలుపు తట్టలేదు.

అయితే, పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తమిళిసైని తెలంగాణ గవర్నర్‌గా నియమించింది. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే, రాజ్యాంగబద్దమైన పదవిని వదిలి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్టు ప్రచారం జరిగింది. మరి భవిష్యత్‌లో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Also Read:

జగత్జంత్రీలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే చోరీ చేశారు..!

తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారందరికీ రూ. 5 లక్షల బీమా..

Advertisment
Advertisment
తాజా కథనాలు