Telangana Assembly: నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు

ఇవాళ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది రేవంత్ సర్కార్. న్యాయ శాఖకు చెందిన రెండు సవరణ బిల్లులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ అభివృద్ధిపై సభలో స్వల్ప చర్చ జరగనుంది.

New Update
Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly Sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు స్పీకర్. సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది రేవంత్ సర్కార్. న్యాయ శాఖకు చెందిన రెండు సవరణ బిల్లులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే న్యాయ శాఖ బిల్లులు సభలో ప్రవేశ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కాగా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు సభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి శ్రీధర్ బాబు. నేడు అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అసెంబ్లీలో సబిత వివాదం..

రేవంత్‌రెడ్డి నన్ను ఎందుకు టార్గెట్‌ చేశారు అని అసెంబ్లీ ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి సంతోషంగా ఆహ్వానించానని చెప్పారు. రేవంత్‌రెడ్డికి తనపై ఎందుకు కక్ష? అని అడిగారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆశా కిరణం అవుతావని చెప్పాను రేవంత్ కు ఆనాడు చెప్పానని అన్నారు. సీఎం అవుతావని కూడా చెప్పానని పేర్కొన్నారు. మనస్ఫూర్తిగా రేవంత్‌రెడ్డిని ఆశీర్వదించునట్లు తెలిపారు.

సబితక్క నన్ను మోసం చేసింది: సీఎం రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సబితక్క కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మాట వస్తామనేని.. తాను కూడా సబితక్కాను సొంత అక్కలాగా అనుకున్నానని చెప్పారు. కొడంగల్ తాను ఎమ్మెల్యేగా ఓటమి చెందిన తరువాత.. కాంగ్రెస్ హైకమాండ్ తనను మల్కాజ్ గిరి ఎంపీ గా పోటీ చేసే అవకాశం కల్పించిందని.. ఆరోజు సబితక్క దగ్గరికి వెళ్లి మద్దతు తెలపాలని కోరగా.. సబితక్క తనకు మద్దతు ఇస్తానని చెప్పి మాట తప్పిందని అన్నారు. కేసీఆర్ మాయ మాటలను నమ్మి ఆనాడు టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొందిందని అన్నారు. తన ఓటమికి మాజీ మంత్రి సబితా ప్రయత్నించిందని చెప్పారు.

Also Read : ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
తాజా కథనాలు