Minister Tummala: తెలంగాణలో జొన్న కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ TG: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జొన్న కొనుగోలుకు సిద్ధమైంది. ఆదిలాబాద్, నిజామాబాద్ రైతుల విజ్ఞప్తి మేరకు జొన్న కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. జొన్నలను మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. By V.J Reddy 04 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Minister Tummala Nageswara Rao: తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తీపి కబురు అందించారు. ఇకపై జొన్నలను కూడా కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ రైతుల విజ్ఞప్తి మేరకు జొన్న కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావించిందని అన్నారు. జొన్న రైతులెవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దు అని అన్నారు. మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇకపై తెలంగాణలో పండిన ప్రతి పంట రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షాన, రైతుల సంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వం అని అన్నారు. మే 9 లోగా రైతు బంధు.. రైతు భరోసా (రైతు బంధు) పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 69 లక్షల మంది రైతులు ఉంటే.. 65 లక్షల మందికి రైతు భరోసా వేసినట్లు చెప్పారు. మిగతా నాలుగు లక్షల మందికి ఈ నెల 8వ తేదీ లోపల రైతు భరోసా వేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీ లోగా ఒక్కరైతుకైనా బకాయి ఉంటే అమర వీరుల స్థూపం ముందు ముక్కు నెలకు రాస్తానని అన్నారు. రైతులందరికీ రైతు భరోసా నిధులు అందితే కేసీఆర్ ముక్కు నెలకు రాసి క్షమాపణలు చెబుతారా? అని సవాల్ విసిరారు. #minister-tummala-nageswara-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి