TS Elections: కేసీఆర్‌ ఓవైసీ బెదిరింపులకు లొంగిపోయాడు.. అమిత్ షా సంచలన ఆరోపణలు

నల్గొండ బీజేపీ సభలో సీఎం కేసీఆర్ పై విమర్శల దాడి చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేసీఆర్‌ ఓవైసీ బెదిరింపులకు లొంగిపోయాడని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ చేసింది అభివృద్ధి కాదు.. అప్పులు అని అన్నారు.

New Update
TS Elections: కేసీఆర్‌ ఓవైసీ బెదిరింపులకు లొంగిపోయాడు.. అమిత్ షా సంచలన ఆరోపణలు

Amit Shah Fires On CM KCR: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తెలంగాణుకు వచ్చారు కేంద్ర హోంమత్రి అమిత్ షా. నల్గొండలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులకుప్పగా చేశారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతికి చెక్ పెట్టాలంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.

ALSO READ: కేసీఆర్ ను మోసం చేస్తే కన్న తల్లిని మోసం చేసినట్టె.. ఎర్రబెల్లి ఎమోషనల్!

సభలో అమిత్ షా మాట్లాడుతూ.. దళితుల కోసం సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకంలో ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని అన్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వం ఓవైసీ బెదిరింపులకు లొంగిపోయిందని ఆరోపించారు. ఓవైసీ మెప్పుకోసమే ఉర్ధూని రెండో భాషగా బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు కుటుంబ పార్టీలని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడించారు.

ALSO READ: ధరణిలో లోపాలు.. కామారెడ్డిలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్మార్ట్‌ సిటీస్‌ కింద నల్గొండకు రూ.400 కోట్లు ఇస్తే ఏం చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు అమిత్ షా తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు