BREAKING: మూడు రోజులు వైన్ షాపులు బంద్!

ఈ నెల 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో మద్యం షాపులు మూసివేయనునట్లు ప్రకటించింది.

New Update
BREAKING: మద్యం ప్రియులకు షాక్.. రేపు, ఎల్లుండి మద్యం షాపులు బంద్

Telangana Elections 2023: మరో 5 రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు పక్కకి పెట్టి అందరు కలిసి చేసుకునే ఒకేఒక పండగ అదే ఎన్నికల పండుగ. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలంటే ముక్క, మద్యం ఏరులై పారాల్సిందే. ఈ నేపథ్యంలో మందు బాబులకు ఎన్నికల కమిషన్ చేదు వార్త అందించింది.

ALSO READ: రూ.15 లక్షలు వచ్చాయా?.. మోదీపై ఖర్గే చురకలు!

తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరుగుతుండడంతో మద్యం షాపులకు కీలక ఆదేశాలు ఇచ్చింది ఈసీ. ఈ నెల 28, 29, 30 తేదిల్లో అన్నీ మద్యం షాపులు బంద్ చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

తాజాగా ఎక్సైజ్‌ ఉన్నతాధికారులతో అబ్కారీశాఖ కమిషనర్‌ ప్రకాశ్‌ సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యంపై నిఘా ఉంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో 1279 మద్యం దుకాణాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇప్పటివరకు రూ. 115.71 కోట్లకుపైగా విలువైన అక్రమ మద్యం, డ్రగ్స్‌ సీజ్‌ చేసినట్లు వెల్లడించారు.

ALSO READ: పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్.. RGV ట్వీట్ వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు