Telangana Elecitons: కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు..

తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం అమరజ్యోతి వద్ద మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నిర్వహించిన ఇంటర్వ్యూపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు ఇవ్వగా.. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించింది ఈసీ.

New Update
Telangana Elecitons: కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు..

KTR Interview: హుస్సేన్ సాగర్ తీరాన గల అమర జ్యోతి వద్ద మంత్రి కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ గోరటి వెంకన్న(Venkanna) ఇంటర్వ్యూ చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు. నిర్వాహకుడు ఎవరనే విషయాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. అమరవీరుల స్మారక ప్రాంగణంలో కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూ నిర్వహించారు. దాదాపు అన్ని న్యూస్ చానళ్లలో, యూట్యూబ్ చానళ్లలో ప్రసారమైంది. అయితే, ఈ ఇంటర్వ్యూపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఇంటర్వ్యూని సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో ఇంటర్వ్యూ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.


కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూ ఇస్తున్నారు. యూట్యూబ్‌లో చాలా ఫేమస్ అయిన 'మై విలేజ్ షో' నిర్వాహకులతో పొలాల్లో ఇంటర్వ్యూ, టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆయా సంఘాలతో మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగులు, ఇలా అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతూ, ఇంటర్వ్యూలు ఇస్తున్న వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కేటీఆర్. ఈ క్రమంలోనే.. తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించేందుకు వినూత్నంగా గోరటి వెంకన్నను ఇంటర్వ్యూ చేశారు మంత్రి కేటీఆర్.

అయితే, ఈ ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ ఇంటర్వ్యూ కోసం వినియోగించడాన్ని తప్పుపడుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు సైతం ఈ ఇంటర్వ్యూపై కేసు నమోద చేశారు.

Also Read:

నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే..

ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు