Telangana Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..

తెలంగాణ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగిసింది. అన్ని పార్టీలు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించాయి. ఈ మేరకు ఈసీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులన్నింటినీ బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

New Update
Telangana Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..

Telangana Election Campaign Closed: తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. వాస్తవానికి 5 గంటల వరకు సమయం ఉంది. కానీ, 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే ప్రచారం ముగిసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. ఎన్నికల బరిలో 2,290 మంది ఉండగా.. వీరిలో 221 మంది మహిళలు నిల్చున్నారు.

నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగనుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల కోసం పని చేయనున్నారు. 45 వేల మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అదనంగా మరో 14 వేల బ్యాలెట్స్ సిద్ధం చేశారు అధికారులు. ఇక డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,63,01,705 మంది కాగా, పురుష ఓటర్లు -1,62,98,418 మంది ఉన్నారు. వీరిలో 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లు- 9,99,667, ట్రాన్స్‌జెండర్లు - 2, 676, దివ్యాంగ ఓటర్లు- 5,06,921, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు- 4,40,371 మంది ఉన్నారు.

35,356 పోలింగ్‌ కేంద్రాలు..

రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. 10వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాలపై స్పెషల్​ ఫోకస్ పెట్టారు అధికారులు. 24 గంటల పాటు సీసీటీవీ మానిటరింగ్‌తో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 600 లకు పైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది ఎన్నికల సంఘం. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 8 జిల్లాల పరిధిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 600 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్ వంటి ఏజెన్సీ ప్రాంతాలకు కేంద్ర బలగాల తరలించారు. బెల్లంపల్లి, అశ్వారావుపేట, పినపాక, ఇల్లందు, మంథని, చెన్నూరు, సిర్పూర్ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 250కి పైగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని 166 చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Also Read:

ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు