Telangana Polling: ఓటర్లలకు అలర్ట్.. పోలింగ్ బూత్‌కు ఇవి తీసుకెళ్లొద్దు.. తెలంగాణలో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఓటర్లు పోలింగ్ బూత్‌లోకి సెల్ ఫోన్లు, పేలుడు పదార్థాలు తీసుకెళ్లవద్దు. ధూమపానం, మద్యం సేవించడం చేయొద్దు. By Shiva.K 29 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Election Polling: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో పోలింగ్(Polling) ప్రారంభం కానుంది. పోలింగ్ సిబ్బంది అంతా సిద్ధమై ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది ఎన్నికల సంఘం. ఓటర్లు నిర్భయంగా, ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడుతోంది. ఇక ఓటరు ఓటు వేయడమే మిగిలి ఉంది. మరికొన్ని గంటల్లో ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అయితే, ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ వెళ్లే ఓటర్ల కోసం ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటర్లు తప్పకుండా ఆ సూచనలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓటర్లు పాటించాల్సిన నియమనిబంధనలు ఇవే.. 👉 ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి ఫోన్లను తీసుకెళ్లకూడదు. 👉 ఓటరు పోలింగ్ కేంద్రంలోకి ఫోన్ తీసుకెళ్లి ఫోటో దిగడం వంటివి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. 👉 పోలింగ్ బూత్‌లో ధూమపానం చేయడం, మద్యం తాగడం చేయొద్దు. 👉 పేలుడు పదార్థాలను తీసుకెళ్లవద్దు. 👉 ఓటర్లు పోలింగ్ సిబ్బందికి సహకరించాలి. 👉 పోలింగ్ సిబ్బంది సూచనలు పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి 👉 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరుగనుంది. 👉 సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లు.. రాత్రి ఎంత సమయం వరకైనా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 👉 సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు అనుమతించరు. Also Read: మీరు తప్పకుండా ఓటేయాల్సిందే.. ఎందుకంటే? సాయంత్రం 5 తర్వాత ఓటు.. కేవలం వీరికి మాత్రమే ఆ ఛాన్స్! #telangana-elections-2023 #telangana-elections #telangana-elections-polling #telangana-polling #telangana-polling-updates #telangana-election-polling-updates #election-polling-updates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి