T CONG EYES BC VOTE BANK  : త్వరలో బీసీ డిక్లరేషన్

తెలంగాణలో అధికారంలోకి రావటానికి ఉన్న ఏ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదలటం లేదు. బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కమిటీని కూడా ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ కమిటీ పూర్తిస్థాయిలో అభిప్రాయ సేకరణ చేసి నివేదిక రూపొందిస్తుంది.

New Update
T CONG EYES BC VOTE BANK  : త్వరలో బీసీ డిక్లరేషన్

T CONG EYES BC VOTE BANK  తెలంగాణలో బీసీ డిక్లరేషన్ రూపకల్పనకు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. బీసీల సంక్షేమం ,రాజకీయ ప్రాధాన్యతపై  ఈ కమిటీ  సిఫార్సులు  చేస్తుంది. అలాగే డిక్లరేషన్ లో చేర్చాల్సిన అంశాలపై సలహాలు,సూచనలు అందచేస్తుంది. ఓబీసీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అది సేకరిస్తుంది. దానితో పాటు ఓబీసీల సంక్షేమం కోసం సమావేశాల వంటివి నిర్వహించే పని కూడా చేపడుతుంది.

బీసీలు తమకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.  ఈ డిమాండ్లను టీపీసీసీ పరిగణనలోకి తీసుకుంటోంది. టిక్కెట్ల విషయంలోనూ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. పొన్నం కమిటీ  పూర్తి స్థాయిలో అభిప్రాయసేకరణ చేసిన అనంతరం నివేదిక రూపొందిస్తుంది.  భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ డిక్లరేషన్ ప్రకటించాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటయ్యే సభకు ముఖ్యఅతిథిగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆహ్వానించనున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే వరుస డిక్లరేషన్లను ప్రకటిస్తూ వస్తోంది. ఈ మధ్యనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించింది. ఈ సభకు మల్లిఖార్జున ఖర్గే (MALLIKHARJUN KHARGE) హాజరయ్యారు. అంతకు ముందు యూత్  డిక్లరేషన్, రైతు డిక్లరేషన్లను కూడా ప్రకటించింది. యూత్ డిక్లరేషన్ ప్రకటనకు ప్రియాంక గాంధీని  (PRIYANKA GANDHI)  ను, రైతు డిక్లరేషన్ సభకు రాహుల్ గాంధీ (RAHUL GANDHI)  ని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు.  ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటనకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. వీటి ద్వారా తమకు మైలేజి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

కమిటీలో ఎవరెవరు ఉంటారు?

➼ సహ ఛైర్మన్లుగా నూతిశ్రీకాంత్‌ గౌడ్‌, ఎర్ర శేఖర్‌ ముదిరాజ్‌, ఇరావత్రి అనిల్‌ నేత, జెరిపాటి జైపాల్‌, గాలి అనిల్‌కుమార్‌ పటేల్‌, తోటకూర వజ్రేష్‌ యాదవ్‌

➼ అడ్వైజరీ కమిటీ చీఫ్ ప్యాట్రన్‌లుగా పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతురావు పటేల్‌, పొన్నాల లక్ష్ముయ్య పటేల్‌

➼ సలహదారులుగా మధుయాస్కీ గౌడ్‌, మహేష్‌కుమార్‌ గౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, కొండా సురేఖ, సురేష్‌ షెట్కర్‌ లింగాయత్‌, డాక్టర్‌ కత్తి వెంకటస్వామి,

సంగిశెట్టి జగదీశ్వర్‌ రావు

➼ ప్రొగ్రామ్‌ కోఆర్డినేటర్‌గా వీర్లపల్లి శంకర్‌ నియామకం

➼ కమిటీ సభ్యులుగా 37 మందికి బాధ్యతలు

ALSO READ: కేసీఆర్‌వి అన్నీ ఉత్తమాటలే.. 24 గంటల కరెంట్‌ ఎక్కడ.?

Advertisment
Advertisment
తాజా కథనాలు