Telangana: భూ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు.. సీఎం రేవంత్ ఆదేశాలు..

భూ సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాలను సూచించాలన్నారు. కమిటీలో మంత్రులు, రెవెన్యూ శాఖ అధికారులు, రైతులు ప్రతినిధులు ఉండాలని సూచించారు.

New Update
Dharani Portal: ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Telangana CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారానికై మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్యశాఖ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి దామోదర రాజ నర్సింహా, రెవిన్యూ, హోసింగ్, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, తదితర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. భూసంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఈ కమిటీ ప్రతిపాదనలను సూచించాలన్నారు. ఈ కమిటీలో మంత్రులతోపాటు రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండాలన్నారు.

ధరణి ప్రారంభం నుండి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై సవివర నివేదిక అందచేయాలని సీఎస్‌ను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో సిఎంఓ అధికారులు శివధర్ రెడ్డి, శేషాద్రి, షా-నవాజ్ ఖాసీంలు పాల్గొనగా, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రైతు ప్రతినిధులు కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్ రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Also Read:

కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి లోపు రెగ్యులరైజ్..

‘దటీజ్ కేసీఆర్’.. ఇంట్రస్టింగ్ ఫోటో షేర్ చేసిన ఎంపీ సంతోష్..

Advertisment
Advertisment
తాజా కథనాలు