Telangana Elections: సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నారా? ఆ ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తారా?

సీఎం కేసీఆర్ తన మనసు మార్చుకున్నారా? ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేయడం లేదా? ఒక చోట నుంచి తాను పోటీ చేసి.. మరో చోట నుంచి బీఫామ్ ఆ నేతకు ఇస్తున్నారా? ఆసక్తి రేపుతున్న సీఎం కేసీఆర్ లోచనలు.

New Update
Telangana Elections: సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నారా? ఆ ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తారా?

వ్యూహాలు పన్నడంలో చాణక్యుడితో సమానం.. ఆయన ప్లాన్ చేస్తే.. ఎలాంటి పరిస్థితి అయినా మోకరిల్లాల్సిందే. ఆయన ఎత్తుగడలను అందుకోవాలంటే.. ప్రత్యర్థులు ఆయన స్థాయిలో ఆలోచించగలగాలి. కానీ, వారు తన ఆలోచనలను రీచ్ అయ్యే లోపే మరో ప్లాన్‌తో వారిని చిత్తు చేస్తారు. ఆయనే బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్ రావు. తన మార్క్ రాజకీయాలతో తెలంగాణలో రెండు దఫాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. మూడోసారి కూడా ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. అందుకు సంబంధించిన వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నారు గులాబీ బాస్.

ఈ వ్యూహంలో భాగంగానే ఒకేసారి 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అంతేకాదండోయ్.. తాను రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు కేసీఆర్. ఇప్పటి వరకు గజ్వేల్ నుంచి పోటీ చేస్తూ వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు కామారెడ్డిని కూడా ఎంచుకున్నారు. గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే, తొలి జాబితా పేరుతో ఒకేసారి 115 నియోజకవర్గాలకు అభ్యర్థులకు ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు ఆ సీట్లలో మార్పులు చేయబోతున్నారట. పరిస్థితులకు అనుకూలంగా, గులాబీ బాస్ వ్యూహాలకు లోబడి ఆ మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల్లో తాను రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో గజ్వేల్ ఒకటి, కామారెడ్డి మరొకటి. ఈ రెండు నియోజకవర్గాల నుంచి కేసీఆర్ పోటీ చేయబోతున్నట్లుగా మీడియా వేదికగా ప్రకటించారు. అయితే, ఇక్కడే ఒక వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కేసీఆర్.. కేవలం కామారెడ్డిలో మాత్రమే పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని ప్రకటించిన నేపథ్యంలో.. ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు.

అయితే, కేసీఆర్ డబుల్ కంటెస్ట్ ప్రకటన వెనుక వ్యూహం ఉందని, ఆయన ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేస్తారని గులాబీ శ్రేణుల్లో ఓ టాక్ నడుస్తోంది. మరో నియోజకవర్గం నుంచి బీఫామ్‌ని మరొకరికి ఇస్తారని తెలుస్తోంది. అది ఎవరికో కాదు.. కేసీఆర్ అన్నయ్య కుమారుడైన వంశీధర్ రావుకు బీఫామ్ ఇస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే వంశీధర్ రావు మహారాష్ట్ర బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఈయనను గజ్వేల్‌ నుంచి బరిలోకి దించాలని భావిస్తున్నారట కేసీఆర్. బీఫామ్‌ను ఆయనకే ఇస్తారని టాక్ వినిపిస్తోంది. కేవలం కామారెడ్డి నుంచి మాత్రమే కేసీఆర్ పోటీకి దిగుతారని తెలుస్తోంది. అంతేకాదండోయ్.. జాతీయ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్న సీఎం కేసీఆర్.. ఎంపీగా పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అయితే, కేసీఆర్ ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆలోచనలపై రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఫైనల్ లిస్ట్ వేరే ఉందా? సీనియర్లంతా ఎంపీగా పోటీ చేస్తారా?

ఇప్పటికే రెండు చోట్ల తాను పోటీ చేస్తానంటూ ప్రకటించిన కేసీఆర్.. జమిలి ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఆయన ఎంపీగా పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్‌ మాత్రమే కాదు.. ఆయనతో పాటు సీనియర్లను కూడా ఎంపీలుగా ఎన్నికల్లోకి దింపుతారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన 115 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల లిస్ట్‌లో మార్పులు, చేర్పులు చేసి.. సీనియర్లను జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని యోచిస్తున్నారట కేసీఆర్. గులాబీ బాస్ ఈ విధమైన ఆలోచనలకు కేంద్రం ప్రకటించిన జమిలి ఎన్నికల ప్రతిపాదనే కారణం అని చెబుతున్నారు పరిశీలకులు. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Also Read:

Telangana CM KCR: దేశ్ కీ నేత కేసీఆర్ నినాదాలతో దద్దరిల్లిన పెళ్లి ప్రాంగణం

Congress Special Focus On Telangana: తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ స్పెషల్ ఫోకస్

#cm-kcr #telangana-elections #telangana-politics #brs-party-mla-candidate-first-list #brs-pary
Advertisment
Advertisment
తాజా కథనాలు