Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో మైనారిటీలకు పెద్దపీట

మైనారిటీలకు బడ్జెట్‌లో పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.3002 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మైనారిటీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, గతేడాది బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2200 కోట్లు కేటాయించింది.

New Update
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో మైనారిటీలకు పెద్దపీట

Telangana Budget: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం గురువారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాగా ఈసారి బడ్జెట్‌లో అనేక కీలక మార్పులు చోటు చేసుకుంది. ఒకవైపు మైనారిటీ సంక్షేమ శాఖ బడ్జెట్ ను పెంచిన పార్టీ మరోవైపు ఎస్సీ-ఎస్టీ శాఖల బడ్జెట్ లో కోత పెట్టింది.

మైనారిటీలకు 3002 కోట్లు

కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు బడ్జెట్ లో పెద్దపీట వేసింది. మైనారిటీ సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ.3002 కోట్లు కేటాయించింది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖకు గతేడాది రూ.2200 కోట్లు కేటాయించింది. కాగా దాదాపు రూ.1200 కోట్లను పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మైనారిటీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఎస్సీ-ఎస్టీ బడ్జెట్‌లో భారీ కోత..

ఇదిలా ఉంటే మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ నిరాశ మిగిల్చింది. వారికి బడ్జెట్ లో మొండిచేయి చూపించిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ బడ్జెట్‌ను రూ.21072 కోట్ల నుంచి రూ.7638 కోట్లకు రికార్డు స్థాయిలో కోత పెట్టిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అంతే కాదు గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్ కూడా రూ.4365 కోట్ల నుంచి రూ.3969 కోట్లకు తగ్గింది. కాగా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షలు విమర్శలు చేస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు