/rtv/media/media_files/2026/05/12/ac-warning-sounds-2026-05-12-18-22-30.jpg)
AC Warning Sounds
AC Warning Sounds: ఎండాకాలంలో ఇంటిని చల్లగా ఉంచడానికి చాలా మంది AC వాడుతున్నారు. కానీ ఇటీవల ACలకు సంబంధించిన ప్రమాదాలు పెరుగుతున్నాయి. సాధారణంగా ACలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది కొన్ని శబ్దాల ద్వారా ముందుగానే సంకేతాలు ఇస్తుంది. ఈ శబ్దాలను నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ AC నుంచి వింతగా శబ్దాలు వస్తే వెంటనే జాగ్రత్త పడాలి. ఇప్పుడు ACలో వినిపించే కొన్ని ముఖ్యమైన శబ్దాలు, వాటి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
1. బలంగా పేలినట్టుగా శబ్దం రావడం
AC ఆన్ చేసినప్పుడు ఒక్కసారిగా గట్టిగా పేలినట్టుగా లేదా బలంగా కొట్టినట్టుగా శబ్దం వస్తే, కంప్రెసర్‌లో సమస్య ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. కంప్రెసర్‌లోని భాగాలు లూజ్ అయితే అవి బయట ఫ్రేమ్‌ను తాకి ఇలాంటి శబ్దం చేస్తాయి. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే టెక్నీషియన్‌ను పిలిపించడం మంచిది.
2. అరుస్తున్నట్టుగా లేదా కీచుమనే శబ్దం
AC నుంచి కీచుమనే శబ్దం వస్తే, ఎక్కువగా అవుట్‌డోర్ ఫ్యాన్ మోటార్‌లో సమస్య ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాన్ ACలోని వేడిని బయటకు పంపేందుకు పని చేస్తుంది. ఫ్యాన్ మోటార్ పాడవడం లేదా కంప్రెసర్ మోటార్‌లో లోపం రావడం వల్ల కూడా ఇలాంటి శబ్దం వస్తుంది. ఈ శబ్దం వినిపిస్తే వెంటనే చెక్ చేయించాలి.
3. గింగిరాలు లేదా Buzzing శబ్దం
AC నుంచి Buzzing శబ్దం వస్తే దాన్ని అసలు పట్టించుకోకుండా ఉండకూడదు. ఫ్యాన్ బ్లేడ్లు లూజ్ అవడం, మోటార్ సమస్యలు, కండెన్సర్ కాయిల్స్ మురికిగా ఉండటం వంటి కారణాలతో ఈ శబ్దం వస్తుంది. కొన్ని సందర్భాల్లో రిఫ్రిజరెంట్ లీక్ ఉన్నా కూడా ఇలాంటి శబ్దం వస్తుంది. ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున వెంటనే రిపేర్ అవసరం.
4. ఖడఖడ శబ్దం
ACలో ఖడఖడ శబ్దం వస్తే, అవుట్‌డోర్ యూనిట్‌లో దుమ్ము, చెత్త లేదా లూజ్ భాగాలు ఉండొచ్చు. కొన్నిసార్లు చిన్న రాళ్లు లేదా ఆకులు యూనిట్‌లోకి వెళ్లినా ఈ శబ్దం వస్తుంది. యూనిట్‌ను శుభ్రం చేయడం ద్వారా ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది.
5. క్లిక్ శబ్దం
AC ఆన్, ఆఫ్ సమయంలో ఒక్కసారి క్లిక్ శబ్దం రావడం సాధారణమే. కానీ వరుసగా క్లిక్ శబ్దం వస్తే అది థర్మోస్టాట్ సమస్య కావచ్చు. పాత థర్మోస్టాట్ సరిగా పనిచేయకపోతే ACలో ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ పని అనుభవం ఉన్న టెక్నిషియన్ తో చేపించుకోవడం మంచిది.
6. విజిల్ మోగినట్టుగా శబ్దం
AC నుంచి సీటీ శబ్దం వస్తే, ఎయిర్ డక్ట్‌లో లీకేజ్ ఉండొచ్చు. అలాగే తప్పు ఎయిర్ ఫిల్టర్ వాడినా లేదా ఎక్స్‌పాంశన్ వాల్వ్‌లో సమస్య ఉన్నా ఈ శబ్దం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ACని ఎక్కువసేపు వాడకుండా వెంటనే టెక్నీషియన్‌తో చెక్ చేయించాలి.
చిన్న శబ్దాలు కూడా పెద్ద సమస్యలకు దారి తీయొచ్చు. సమయానికి గుర్తించి సరిచేస్తే AC ఎక్కువ రోజులు బాగుంటుంది. అలాగే ప్రమాదాలు, అధిక ఖర్చులు కూడా తగ్గుతాయి. కాబట్టి AC నుంచి అసాధారణ శబ్దాలు వస్తే ఆలస్యం చేయకుండా నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Follow Us