Amazfit Smart Watches : స్మార్ట్‌వాచ్‌లపై భారీ ఆఫర్స్.. Amazfit Active, Amazfit Balance పై 55% తగ్గింపు..! ప్రముఖ బ్రాండ్ అమాజ్‌ఫిట్ స్మార్ట్‌వాచ్‌లపై భారీ ఆఫర్‌లను ప్రకటించింది. జూలై 20-22 వరకు జరిగే అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఈ ఆఫర్స్ అందుబాటులోకి రానున్నాయి. Amazfit Active, Amazfit Balance, Amazfit Edge స్మార్ట్‌వాచ్‌లపై 55 శాతం తగ్గింపును పొందవచ్చు. By Archana 14 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Amazfit Smart Watches : ప్రముఖ బ్రాండ్ అమాజ్‌ఫిట్ కొన్ని బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌వాచ్‌లలో భారీ డిస్కౌంట్లను ఇస్తుంది. Amazfit Active, Amazfit Balance, Amazfit Edge వంటి స్మార్ట్‌వాచ్‌లపై 55 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్లు అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) సమయంలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా స్మార్ట్ వాచ్ లవర్స్ ఇప్పటి నుంచే మీ విష్‌లిస్ట్ యాడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఆఫర్ డీటెయిల్స్ Amazfit Active : ఈ స్మార్ట్ వాచ్ నిర్ణిత ధర రూ. 19,999 MRP. ఈ వాచ్ ప్రైమ్ డే సేల్ సమయంలో 50 శాతం తగ్గింపుతో లభిస్తుంది. రూ. 19,999 కేవలం రూ. 9,999కే కొనుగోలు చేయవచ్చు. Amazfit Active Edge : - అమాజ్ ఫిట్ నుంచి ఈ శక్తివంతమైన స్మార్ట్ వాచ్ సాధారణంగా రూ 19,999 కు విక్రయించబడుతుంది. కానీ ఈ వాచ్ ను అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో 55 శాతం తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ 19,999 వాచ్ కేవలం రూ. 8,999 కే లభిస్తుంది. Amazfit BIP 5 Unity: Amazfit స్మార్ట్‌వాచ్ లైనప్‌లో చాలా సరసమైన, చౌకైన ఎంపిక, BIP 5. దీని ధర రూ 7,999. కానీ అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా ఈ వాచ్ పై 37 శాతం తగ్గింపు అందించబడుతుంది. రూ 7,999 వాచ్ ను కేవలం రూ. 4,999 కే కొనుగోలు చేయవచ్చు. Amazfit Balance: అమాజ్ ఫిట్ బ్రాండ్ వాచ్ లలో అత్యంత ఖరీదైన ఎంపికలలో ఒకటి, Amazfit Balance. దీని రిటైల్ ధర రూ. 30,999. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఈ వాచ్ 29 శాతం తగ్గింపు ధరతో లభిస్తోంది. కేవలం రూ. 21,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. Also Read: Ambani Wedding: అంబానీ పెళ్ళిలో సినీ తారల డాన్సులు.. సందడే సందడి..! వీడియో వైరల్ - Rtvlive.com #amazon-offers #amazfit-smart-watch-offers #amazfit-active మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి