Team India: వచ్చే నెల రోజులు భారత్ క్రికెట్ అభిమానులకు కిక్కే కిక్కు భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్ టోర్నీకి 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే బీసీసీఐ పూర్తి చేసింది. మరోవైపు టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో భారత్-ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. By BalaMurali Krishna 19 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Team India: భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్ టోర్నీకి 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే బీసీసీఐ పూర్తి చేసింది. మరోవైపు టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో భారత్-ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. ఆసీస్‌తో వన్డే సిరీస్ అయిపోగానే వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులు ఆడనుంది రోహిత్ సేన. అనంతరం మెగా టోర్నీ ప్రారంభంకానుంది. దీంతో వచ్చే నెల రోజుల్లో భారత్ క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ దొరకనుంది. ఈ నెల రోజుల్లో భారత్ షెడ్యూల్ ఓసారి పరిశీలిస్తే.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ షెడ్యూల్.. ** సెప్టెంబర్ 22: మొదటి వన్డే(మొహాలీ) ** సెప్టెంబర్ 24: రెండో వన్డే(ఇండోర్) ** సెప్టెంబర్ 27: మూడో వన్డే(రాజ్‌కోట్) తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్. మూడో వన్డేకు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా , శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అశ్విన్ ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచుల షెడ్యూల్: ** సెప్టెంబర్ 30: భారత్ vs ఇంగ్లండ్( గౌహతి) ** అక్టోబర్ 3: భారత్ vs నెదర్లాండ్స్(తిరువనంతపురం) వన్డే ప్రపంచకప్ షెడ్యూల్: ** అక్టోబర్ 8: భారత్ vs ఆస్ట్రేలియా(చెన్నై) ** అక్టోబర్ 11: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్(ఢిల్లీ) ** అక్టోబర్ 14: భారత్ vs పాకిస్థాన్(అహ్మదాబాద్) ** అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్(పూణె) ** అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్(ధర్మశాల) ** అక్టోబర్ 29: భారత్ vs ఇంగ్లండ్ (లక్నో) ** నవంబర్ 2: భారత్ vs శ్రీలంక – ముంబై ** నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా( కోల్‌కతా) ** నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్(బెంగళూరు) ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి