వంగవీటి రాధాకృష్ణ పెళ్లి డేట్ ఫిక్స్..ఎప్పుడో తెలుసా..? వంగవీటి రాధాకృష్ణ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 22న వంగవీటి రాధాకృష్ణ నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె జక్కం పుష్ప వల్లిని పెళ్లి చేసుకోనున్నారు. ఈ వివాహానికి విజయవాడ సమీపంలోని మురళి రిసార్ట్ వేదిక కానుంది. By Jyoshna Sappogula 08 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి vangaveeti Radha: వంగవీటి రాధాకృష్ణ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 22న వంగవీటి రాధాకృష్ణ నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె జక్కం పుష్ప వల్లిని పెళ్లి చేసుకోనున్నారు. ఈ వివాహానికి విజయవాడ సమీపంలోని మురళి రిసార్ట్ వేదిక కానుందని తెలుస్తోంది. రాత్రి 7.59 నిమిషాలకు పుష్పవల్లి మెడలో వంగవీటి రాధాకృష్ణ మూడుముళ్లు వేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ 22న రాత్రి 7.59 నిమిషాలకు శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నంలో ముహూర్తం ఖాయం చేశారు. ఈ పెళ్లి వేడుక విజయవాడ – నిడమానూరు పోరంకి రోడ్డు లోని మురళి రిసార్ట్స్‌లో జరుగనుంది. ఈ మేరకు శుభలేఖలు సిద్ధమయ్యాయి. ఈ నెల 22న రాధ, పుష్పవల్లిలు వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. వంగవీటి రాధ, పుష్పవల్లిలకు గత నెల 3న నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వివాహ ముహూర్తం ఖరారైంది.. ఈ జంట వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వివాహానికి వంగవీటి అభిమానులతో పాటు వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. కాగా, విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తో వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాతి కాలంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీచేయగా.. ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. పుష్పవల్లి తల్లి జక్కం అమ్మాణి 1987-92 వరకు టీడీపీ నుంచి నరసాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆమె తండ్రి గతంలో నరసాపురం టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. మొత్తానికి ఈ నెల 22న వంగవీటి రాధ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. Also Read: బండారుపై రోజా సీరియస్ యాక్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి #vijaya-wada #vangaveeti-radha-marriage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి